వారిని తొక్కేశాడు.. జీవితాన్ని నాశనం చేశాడు.. సల్మాన్ ఖాన్‌పై నెటిజన్స్ ఫైర్
సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌లో సునామినీ సృష్టిస్తోంది. డిప్రెషన్‌కు లోనైన సుశాంత్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సినీ తారలనే కాదు సామాన్య జనాన్ని సైతం కదిలించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడని కామెంట్స్ చేశారు. సెలెబ్రిటీలు సైతం చాలా త్వరగా వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తూ.. సోషల్ మీడియా మొత్తం బాలీవుడ్‌ను వేలెత్తి చూపుతోంది.

బాలీవుడ్ బంధుప్రీతే కారణం..
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో పాతుకుపోయిన నెపోటిజమే కారణమని అందరూ ముక్తకంఠంగా చెబుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ, అలియా భట్ వంటి వారిపైనా ట్రోల్స్ చేస్తున్నారు. మీ మాఫియా వల్లే సుశాంత్ మరణించారని, ఇన్వెస్టిగేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్వీట్స్ మాత్రమే..
సుశాంత్ సింగ్ మరణం పట్ల కేవలం ట్వీట్స్ మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని, ఒక్క టాప్ సెలెబ్రిటీ కూడా సుశాంత్‌ను చివరి చూపు చూసేందుకు హాస్పిటల్‌కు రాలేదని మండిపడ్డారు. వివేక్ ఒబేరాయ్, కృతిసనన్, వంటి ఐదారుగురు మాత్రమే వచ్చారు. దీంతో వీరు పేర్లు నిన్న ట్రెండ్ అయ్యాయి.

సల్మాన్‌పై ఫైర్..
అయితే సుశాంత్ అంత్యక్రియలకు వివేక్ ఒబేరాయ్ హాజరు కావడంతో సల్మాన్ టాపిక్ వైరల్ అయింది. సల్మాన్ కూడా గతంలో వివేక్ ఒబేరాయ్‌ను వెలివేశాడని, తొక్కేశాడని ఆ బాధ తెలుసు గనకే వచ్చాడని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సల్మాన్ నాడు చేసిన విషయాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ వచ్చారు.

జీవితాలను నాశనం చేశాడు..
బీయింగ్ హ్యూమన్ మాత్రమే ట్యాగ్ లైన్ పెట్టుకుంటాడు కానీ హ్యూమన్‌గా ప్రవర్తించడని, పాదచారులను తొక్కి చంపించాడని, కృష్ణ జింకను వేటాడానని, అర్జిత్ సింగ్, వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యా రాయ్ వంటి వారి జీవితాలను నాశనం చేశాడని కామెంట్స్ చేశాడు. బాలీవుడ్‌ను ఇలాంటి వారు గుప్పిట్లో పెట్టుకుని ప్రతిభను తొక్కేస్తున్నారని ఫైర్ అయ్యారు.


Click it and Unblock the Notifications











