Vijay Varma: తమన్నాకు షాక్ ఇచ్చిన ఆమె ప్రియుడు.. వేరే భార్య కావాలంటూ బహిరంగ ప్రకటన

మంచు హీరో మనోజ్ శ్రీ సినిమా ద్వారా పరిచయం అయిన గ్లామరస్ బ్యూటి తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో యూత్ లో చెరగని ముద్ర వేసుకుంది. పుష్కర కాలంగా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ మిల్కీ బ్యూటి. అయితే ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్లు, వాళ్లు రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తనకు వధువు కావాలంటూ తమన్నాకు షాక్ ఇచ్చాడు ఆమె ప్రియుడు విజయ్ వర్మ.

హ్యాపీడేస్ మూవీతో: హ్యాపీ డేస్ సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టిన భామ తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లలో సుమారు 50కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా ఆకట్టుకుంటూ తన సత్తా చాటుతోంది ఈ మిల్కీ బ్యూటి. ఆమె గతేడాది బబ్లీ బౌన్సర్ సినిమాతో ఓటీటీలో గుర్తుందా శీతకాలం మూవీతో థియేటర్లలో సందడి చేసింది.

Tamanna Boyfriend Vijay Varma

వరుస చిత్రాలు: ప్రస్తుతం ముద్దుగుమ్మ తమన్నా మెగా స్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ చిత్రంలో కూడా అలరించనుంది ఈ భామ. ఇదే కాకుండా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీసులోనూ యాక్ట్ చేస్తుంది తమన్నా.

Tamanna Boyfriend Vijay Varma

ముద్దులు పెట్టుకోవడం: ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటిఫుల్ తమన్నా, బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇదివరకు తమన్నాపై రిలేషన్ షిప్, పెళ్లి వార్తలు రాగా ఘాటుగా స్పందించింది ఈ సుందరి. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో, కారులో ప్రైవేట్ గా విజయ్ వర్మతో తమన్నా దొరకడం, ముద్దులు పెట్టుకోవడంతో ఈ రూమర్స్ నిజమేనని టాక్ వస్తోంది.

బహిరంగ ప్రకటన: అంతేకాకుండా ఇటీవల విజయ్ వర్మ నటించి లేటెస్ట్ వెబ్ సిరీస్ దహాద్ ప్రమోషన్స్ లో తమన్నాతో రిలేషన్ అతని ఆన్సర్ కు అంతా నిజమేనని ఫిక్స్ అయ్యారు. తమన్నాతో డేటింగ్ నిజమేనని అడగ్గా.. విజయ్ వర్మ స్మైల్ ఇచ్చాడు. దీంతో అది నిజమేనని బాలీవుడ్ మీడియాలో వార్తలు కన్ఫర్మ్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా వధువు కావాలెను అని విజయ్ వర్మ ఇచ్చిన బహిరంగ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.

Tamanna Boyfriend Vijay Varma

మదర్స్ డే సందర్భంగా: మదర్స్ డే సందర్భంగా తన అమ్మకు విషెస్ తెలియజేస్తూ ఫొటోలు పంచుకున్నాడు విజయ్ వర్మ. అందులో విజయ్ వర్మ తల్లి తన కొడుకు ఫొటోతో "ఇండియాస్ ఫస్ట్ బ్యాచిలర్.. వధువు కావలెను" అని ఉన్న ప్రకటనతో పేపర్ తో కనిపించింది. ఈ పోస్ట్ ను షేర్ చేసిన విజయ్ వర్మ.. "ఈ ప్రచారం గురించి మా అమ్మకు అర్థం అయ్యేలా చెప్పాలి" అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

సంబంధం లేకుండా: ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు.. "భార్యా కావాలని అడగటం ఏంటీ.. తమన్నా ఉంది కదా" అని అడుగుతున్నారు. "తమన్నాకు భలే షాక్ ఇచ్చావ్ కదా" అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే దహాద్ ప్రమోషన్స్ లో భాగంగానే విజయ్ వర్మ క్యారెక్టర్ గురించి చెబుతూ ఆ ప్రకటన ఇచ్చారు. కానీ సిరీసులో అతని పేరుకు ప్రకటనలోని పేరుకు సంబంధం లేకుండా ఉంది. అయితే ఈ యాడ్ ప్రమోషన్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా చేసిందిగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X