twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలని వాడుకున్న క్రూరుడు.. 'సంజు' సినిమా కాదు, యాడ్ ఫిల్మ్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

    |

    ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ఉన్న బాలీవుడ్ చిత్రం ఏది విడుదల అయినా వివాదంలో చిక్కుకుంటోంది. ఆ మధ్యన చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన పద్మావత్ చిత్రం వివాదాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన సంజు చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఓ వైపు ప్రశంసలు కురుస్తుంటే మరో వైపు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. సంజయ్ దత్ ని కేవలం మహాత్ముడిలా చూపించడానికే ఈ చిత్రం తీసారని విమర్శలు ఎదురవుతున్నాయి. మరి అతడిపై వచ్చిన ఆరోపణల సంగతి ఏమిటని ప్రశ్నించే వారు అధికం అవుతున్నారు.

    Recommended Video

    Sanju Movie About To Break All Records
     సంజయ్ దత్‌గా రణబీర్

    సంజయ్ దత్‌గా రణబీర్

    ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించాడు. సంజు చిత్రం ఘనవిజయం దిశగా దూసుకు పోతోంది. రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు ఎంత ప్రభావవంతంగా సినిమాలు చేయగలరో గతంలోనే రుజువైంది.

     సినిమా పరంగా

    సినిమా పరంగా

    రణబీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వ ప్రతిభకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా పరంగా చూస్తే ఇది 100 శాతం ఘనవిజయమే. కానీ సంజు చిత్రం సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించింది. ఇందులో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ప్రేక్షకులను గమనిస్తారు.

     వివాదాల మయం

    వివాదాల మయం

    సంజయ్ దత్ జీవితం మొత్తం వివాదాల మయంగా గడిచింది. సంజయ్ దత్ తన జీవితంలో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. కెరీర్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. ఆ వివాదాలని దర్శకుడు పారదర్శకంగా చూపించలేదనే విమర్శలు క్రమంగా పెరుగుతున్నాయి.

     అక్రమాయుధాల

    అక్రమాయుధాల

    అక్రమాయుధాల రవాణా, డ్రగ్స్ వాడకం ఇలా అనేక వివాదాల్లో సంజయ్ దత్ చిక్కుకున్నారు. ఇన్ని మచ్చల నడుమ కూడా దర్శకుడు సంజయ్ దత్ ని మహాత్ముడిలా చూపించే ప్రయత్నం చేసారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

    బయోగ్రఫీ కాదు

    బయోగ్రఫీ కాదు

    సోషల్ మీడియాలో సంజు చిత్రంపై పలువురు నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ ఇలా ఉన్నాయి. ఇది బయోగ్రఫీ కాదు హేజియోగ్రఫీ. అసలు స్వరూపాన్ని కాకుండా మహాత్ములుగా చూపించే ప్రయత్నం.

     అతిపెద్ద యాడ్ ఫిల్మ్

    అతిపెద్ద యాడ్ ఫిల్మ్

    యాడ్ ఫిలిమ్స్ చేసేవాడు ఎప్పటికి అలాంటి చిత్రాలే చేస్తాడు. తనకు ఇష్టమైన సంజయ్ దత్ ని మంచి వ్యక్తిగా చూపించడం కోసం రాజ్ కుమార్ హిరానీ అతిపెద్ద యాడ్ ఫిల్మ్ 'సంజు'. ఈ చిత్రాన్ని ఒక సినిమా ఎన్నో అబద్దాలు అనే ట్యాగ్ లైన్ పెట్టాలి.

     క్రూరమైన క్రిమినల్

    క్రూరమైన క్రిమినల్

    ఆడవాళ్ళని వాడుకున్న క్రూరమైన క్రిమినల్ జీవితాన్ని వైట్ వాష్ చేసి చూపించారు. ఇది కూడా నేరంతో సమానమే.

    ఉగ్రవాది కాదు

    ఉగ్రవాది కాదు

    సంజయ్ దత్ ఉగ్రవాది కాదు అని ప్రపంచానికి అనే విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే ఈ సినిమా తీసారని అనిపిస్తోంది.

     మొత్తం మీడియా వల్లే

    మొత్తం మీడియా వల్లే

    సంజయ్ దత్ జీవితంలో నెలకొన్న వివాదాలకు కారణం మీడియానే కారణం అనే విధంగా ఈ చిత్రంలో చూపించారు. ఇది చాలా తప్పు.

    English summary
    Netizens satires on Sanju movie. Some people called it as Sanju is biggest ad film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X