40 ఏళ్ల స్టార్ హీరో . 20 ఏళ్ల కుర్ర హీరోయిన్‌తో రొమాన్సా? తండ్రి, కూతుళ్లంటూ నెటిజన్స్ దారుణంగా
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు తన 40వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ క్రేజీ హీరో పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన నటించిన ధురంధర్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అయితే ఈ మోషన్ పోస్టర్‌కు అనూహ్యమైన రెస్సాన్ వస్తున్నది. అయితే ఈ చిత్రంలోని హీరోయిన్‌తో రణ్‌వీర్ సింగ్ చేసిన రొమాన్స్ గురించి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య వయోభేధం గురించి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధురందర్ సినిమా ఫస్ట్ లుక్ గురించి.. అలాగే ఆ చిత్రంలో నటిస్తున్న కుర్ర హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే..
రణ్ వీర్ ఇప్పటి వరకు నటించిన పవర్ ఫుల్ రోల్స్ అంటే పద్మావత్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ మూవీ తర్వాత రణ్‌వీర్ అంతగా యాంగ్రీ యంగ్ మ్యాన్ కంటెంట్ సినిమా మాత్రం చేయలేదు. అయితే తాజాగా దురంధర్ అనే సినిమాలో కనీవినీ ఎరుగని రీతిలో తన పాత్రను పోషించాడు. ఫస్ట్ లుక్ టీజర్‌లో రణ్‌వీర్ రూపం చూస్తే ఎవరికైనా హడల్ పుట్టాల్సిందే.

ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్ లాంటి సీనియర్ హీరోలు నటిస్తున్నారు. ఈ టీజర్‌లో వారి లుక్స్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. ఫస్ట్ లుక్‌తోనే ధురంధర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకొన్నదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్నది.
ఇక దురంధర్ చిత్రంలో తమిళంలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకొన్న సారా అర్జున్ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ అమ్మాయి వయసు కేవలం 20 సంవత్సరాలే. ఈ అమ్మాయి దక్షిణాది ప్రేక్షకులకు పొన్నియన్ సెల్వన్, శైవం, దైవ తిరుమంగల్ అనే సినిమాల ద్వారా అత్యంత గుర్తింపు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం దురంధర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

అయితే దురంధర్ సినిమాలో సీనియర్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో నటిచడం ఏమిటి? సారాకు వయసు 20 ఏళ్లే. ఆయన వయసేమో 40 సంవత్సరాలు. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్లు. ఇంత గ్యాప్ ఉన్న హీరోతో ఈ చిన్నారి హీరోయిన్ రొమాన్స్ చేస్తుందా? ఏమిటీ ఈ ఖర్మ అంటూ నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వారిద్దరిని చూస్తే తండ్రి, కూతుళ్ల మాదిరిగా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
సారా అర్జున్ ఎవరనే విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ కూతురు. ఆయన సీక్రెట్ సూపర్ స్టార్, పలు హిందీ సినిమాల్లో నటించారు. ఇక సారా అర్జున్ జూన్ 1 తేదీ, 2005 సంవత్సరంలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన దైవ తిరుమగల్ అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. హిందీలో ఏక్ లడ్కీతో దేఖాతో ఐసా లగా, తులసిదాస్ జూనియర్, పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కొటేషన్ గ్యాంగ్ 1, ధురంధర్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











