బాలీవుడ్ ఖాన్‌లను సెగ.. వారిని బాయ్‌కాట్ చేయండి.. ఆమిర్ ఎక్కడని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

సుశాంత్ సింగ్ ఆత్మహత్య జ్వాలలు ఇంకా తగ్గడం లేదు. వారం రోజులు గడిచినా కూడా సుశాంత్ మృతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కరణ్ జోహర్, అలియా భట్, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ ఇలా ప్రతీ ఒక్కరిపైనా ఫైర్ అవుతున్నారు. తాజాగా ఖాన్ త్రయంపై విరుచుకుపడుతున్నారు. బాయ్ కాట్ ఖాన్స్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. సోనమ్ కపూర్‌ను చీల్చి చెండాడని నెటిజన్లు ప్రస్తుతం ఖాన్ త్రయాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు ట్విట్టర్‌లో ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం.

Recommended Video

Sushant Singh Rajput: Karan Johar, Salman Khan ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి!!
 సుశాంత్ మరణంపై..

సుశాంత్ మరణంపై..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన అందర్నీ కలిచి వేసింది. సినీ సెలెబ్రిటీల కంటే సామాన్య జనమే ఎక్కువగా స్పందిస్తున్నారు. కేవలం డిప్రెషన్ కారణమే కాదని, అతని మరణానికి బాలీవుడ్, నెపోటిజమ్, సినీ పెద్దలేనని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

బాలీవుడ్‌పై ఫైర్...

బాలీవుడ్‌పై ఫైర్...

బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన నెపోటిజంపై ప్రజలు నేడు తిరగబడుతున్నారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. స్టార్స్ కిడ్స్ కోసం కొత్తవారిని తొక్కేస్తాడని, ఇండస్ట్రీలోకి రానివ్వడంటూ కరణ్ జోహర్‌ను గత కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తూనే వస్తున్నారు.

 స్పందించిన సల్మాన్..

స్పందించిన సల్మాన్..

సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఓ ట్వీట్ వేశాడు. తనను తిడుతున్న సుశాంత్ ఫ్యాన్స్‌పై ఫైర్ కావొద్దని తన అభిమానులకు సల్మాన్ సూచించాడు. వారెంతో బాధలో ఉన్నారు ఇలాంటి సమయంలో వారికి తోడుగా ఉండాలని, వారిని కామెంట్ చేయకండని సల్మాన్ తన ఫ్యాన్స్‌ను కోరుకున్నాడు.

బాయ్ కాట్ ఖాన్స్..

బాయ్ కాట్ ఖాన్స్..

ప్రస్తుతం ట్విట్టర్ బాయ్ కాట్ ఖాన్స్ అని ట్రెండ్ అవుతోంది. ఖాన్ సినిమాలను చూడొద్దని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్ కలిసి సుశాంత్‌ను ఏడిపించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు షారుఖ్ ఖాన్‌పై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. BoycottKhans అనే హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఆమిర్ ఖాన్ ఎక్కడా అని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. ఇంతవరకు స్పందించలేదని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండ్ చేస్తే సరిపోదు..

ట్రెండ్ చేస్తే సరిపోదు..

ఇలా బాయ్ కాట్ చేయండని ట్రెండ్ చేస్తే సరిపోదని, ఖాన్‌ల సినిమాలను, స్టార్ కిడ్స్ సినిమాలను చూడొద్దని నిశ్చయించుకోవాలని అన్నాడు. రెండు మూడు నెలల్లో మళ్లీ అంతా మరిచిపోతారు.. వారి సినిమాలు విడుదలవుతాయి. మనం వాటిని చూస్తామని చెప్పుకొచ్చారు. అలా కాకుండా వారి సినిమాలను చూడకుండా ఉండాలని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X