Raj Kundra case: ఎక్కువగా అలాంటి మోడల్స్ పై టార్గెట్.. తక్కువ ఖర్చులోనే అశ్లీల సినిమాలు!

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల పోర్న్ సినిమాలు చిత్రీకరించిన కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో శిల్పా శెట్టి కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో కేసుకు సంబంధించి ఎదో ఒక విషయం రోజుకోటి హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే రాజ్ కుంద్రా ఎక్కువగా ఓ వర్గం మోడల్స్ ను టార్గెట్ చేసేవారని కథనాలు వెలువడుతున్నాయి.

 ఒక ప్రధాన వ్యక్తి వల్లే..

ఒక ప్రధాన వ్యక్తి వల్లే..

అశ్లీల వీడియోలు ప్రొడ్యూస్ చేసిన చాలామందిని అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంత పెద్ద వారు ఉన్నా కూడా గుట్టు లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ కుంద్రాకు చెందిన ఒక ప్రధాన వ్యక్తి వల్లే ఈ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే కేసు నమోదవ్వగా అరెస్ట్ కాకుండా రాజ్ కుంద్రా లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

 విచారణ కోసం కస్టడీలోనే

విచారణ కోసం కస్టడీలోనే

ఇక ప్రస్తుతం కస్టడీలోనే ఉన్న రాజ్ కుంద్రా బెయిల్ కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు గాని న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బయటకు వెళితే మళ్ళీ సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని అధికారులు అతనికి బెయిల్ రాకుండా జాగ్రత్త పడ్డారు. విచారణ కోసం కస్టడీలోనే మరో వారం పాటు ఉంచాలని కోర్టును అభ్యర్దించారు.

 మూడేళ్ళలోనే భారీగా..

మూడేళ్ళలోనే భారీగా..

ఇక ఇండియాలో పోర్న్ మాఫియాకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెక్ పెడుతున్నప్పటికి వర్కౌట్ అవ్వడం లేదు. గత రెండు మూడేళ్ళలో అశ్లీల వీడియోల హవా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారు.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
అలాంటి వారిపై టార్గెట్

అలాంటి వారిపై టార్గెట్

ముంబైలో కొంతమంది మోడల్స్ ను అలాగే వేశ్యలతో పోర్న్ సినిమాలను షూట్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు దొరికితే వారితో కొన్ని నెలల పాటు డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారట. హీరోయిన్ పూనమ్ పాండే కూడా హాట్ షాట్స్ కోసం అలాంటి ఆఫర్ తో లోబరుచికునే ప్రయత్నం చేశారు. కానీ ఆమె డైరెక్ట్ గా రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేసింది.

తక్కువ ఖర్చులోనే..

తక్కువ ఖర్చులోనే..

ఇక రాజ్ కుంద్రా వ్యవహారం బట్టబయలు కావడంతో ఎన్నో పాత విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవల వారి ఇంట్లో సోదాలు నిర్వహించగా దాదాపు వందకు పైగా అశ్లీల వీడియోల డేటా లబించినట్లు తెలుస్తోంది. ఇక వాటికి ఖర్చు కూడా తక్కువగానే పెట్టారని ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తోందట. సన్నిహితులు ఫామ్ హౌజ్ లను అలాగే చిన్నపాటి హోటల్స్ లలో షూటింగ్ చేసి యాప్స్ లో విడుదల చేస్తున్నారట. దీంతో నిర్మాత భారీ లాభాలను అందుకుంటున్నారని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఇంకా ఎన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X