సుశాంత్ డెత్: దర్శకుడితో కలిసి రియా చక్రవర్తి మాస్టర్ ప్లాన్, అతనికి అడిగినంత డబ్బు ఇచ్చి..
రెండు నెలలు పూర్తయినా కూడా ఇంకా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం యొక్క మిస్టరీ వీడలేదు. ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బాలీవుడ్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఒక స్టార్ డైరెక్టర్ తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసినట్లు కథనాలు వేలువడుతున్నాయి.
Recommended Video

దర్శకుడితో రియా మాస్టర్ ప్లాన్
రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం.. రియా చక్రవర్తి ప్రముఖ దర్శకుడితో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కేసు విషయంలో దాదాపు తనపై జనాల్లో ఒక తప్పుడు అభిప్రాయం ఉందని తెలుసుకున్న రియా ప్రపంచానికి తనపై ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకోసం దర్శకుడికి ఫోన్ చేసి సహాయం కోరిందట.

పాజిటివ్ వార్తలు వచ్చేలా..
అయితే ఆ దర్శకుడు కూడా రియాకు సహాయం చేసినట్లు టాక్ వస్తోంది. మీడియాలో తనపై పాజిటివ్ వార్తలు వచ్చేలా చేయాలని అందుకు ఒక నమ్మకమైన ప్రముఖ జర్నలిస్ట్ సహాయం తీసుకోవాలని రియా ఆ దర్శకుడిని కోరినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దర్శకుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఫ్రెండ్లి మీడియా ఆమె కాన్సెప్ట్ తో రియా PR టీమ్ వెనుక నుంచి డీల్ సెట్ చేసినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.

అతనికి అడిగినంత డబ్బు ఇచ్చి..
ఆ ప్రముఖ జర్నలిస్ట్ ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వాలని కూడా రియా నిర్ణయం తీసుకుందని దర్శకుడి మద్దతుతోనే ఇటీవల వాట్సాప్ చాట్ కూడా రిలీజ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆ వాట్సాప్ చాట్ లో తమ మధ్య ఎలాంటి బ్యాడ్ రిలేషన్ లేదు. ఒక తండ్రి కూతుళ్ళ లాంటి రిలేషన్ మాత్రమే ఉందనే విధంగా రియా ప్రపంచానికి తెలియజేయాలని అనుకుందట.

కావాలనే లీక్ చేశారా?
ఇక రియా కావాలనే వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ ని బాలీవుడ్ మీడియాలో లీక్ చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అందుకు ప్రముఖ జర్నలిస్ట్ కూడా రియా చక్రవర్తికి సహాయం చేసినట్లు టాక్. ఇక సీబీఐ అధికారులు సుశాంత్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించిన వారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











