పెళ్ళై పదిరోజులు కూడా కాలేదు.. అప్పుడే మొదలుపెట్టేశాడు, టెంపర్ రీమేక్ కోసం!
Recommended Video

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, అందాల తార దీపికా పదుకొనె వివాహం ఇటీవల ఇటలీలో ఘనంగా జరిగింది. ఇటలీలోని ప్రఖ్యాత లేక్ కొమోలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య రణవీర్, దీపికా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే బెంగుళూరులో కళ్ళు చెదిరే విధంగా భారీ రిసెప్షన్ నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న దీపికా, రణవీర్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా రణవీర్ తన దర్శకుడు రోహిత్ శెట్టితో కనిపించి ఆశ్చర్యపరిచాడు.

పెళ్ళై పదిరోజులు కాకముందే
నవంబర్ 14న దీపికా పదుకొనె, రణవీర్ వివాహం జరిగింది. పెళ్ళై పదిరోజులు కూడా గడవక ముందే రణవీర్ సింగ్ తన సినిమా పనుల్లో తిరిగి నిమగ్నమైపోయాడు. రణవీర్ సింగ్ ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ చిత్రం టెంపర్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి సింహా పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది.

డబ్బింగ్ కోసం
సింహా చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనితో రణవీర్ సింగ్ కొత్త పెళ్లి కొడుకు అయినప్పటికీ ఈ చిత్ర డబ్బింగ్ వర్క్ ప్రారంభించక తప్పలేదు. డబ్బింగ్ కోసం హాజరైన సందర్భంగా రణవీర్, రోహిత్ శెట్టితో దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది.

హీరోయిన్‌గా సారా అలీఖాన్
సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా మారిపోయింది. సారా అలీఖాన్ డెబ్యూ మూవీ కేదర్ నాథ్ డిసెంబర్ 7 న విడుదలవుతుండగా, కొద్ది రోజుల గ్యాప్‌లోనే సింహా చిత్రం విడుదలవుతోంది. రణవీర్ సింగ్, సారా అలీఖాన్ కెమిస్ట్రీపై బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రెండు చిత్రాలతో సారా అలీఖాన్ ఎలా మెప్పిస్తుందో అని చర్చ జరుగుతుండగా.. కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఈ అమ్మడి మాటల ధాటికి అంతా మంత్ర ముగ్దులు అవుతున్నారు.

ఫోటోలు లీక్
సింహ చిత్రంలో అదిరిపోయే మాస్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌కి సంబందించిన సారా అలీఖాన్, రణవీర్ సింగ్ స్టిల్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సాంగ్‌లో సారా అలీఖాన్, రణవీర్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంది సమాచారం. ఇదిలా ఉండగా టెంపర్ చిత్రాన్ని తమిళంలో విశాల్ రీమేక్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











