twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ కోసం రంగంలోకి ఎన్ఐఏ.. ఇప్పుడైనా నిజం బయటపడుతుందా..?

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది అనేక రకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఈ మిస్టరీలో ఉన్న రహస్యం ఏమిటనేది ఇంతవరకు బయటపడలేదు. ముంబై, బీహార్ పోలీసులతొ పాటు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోలు బ్యూరోలు ఈ కేసుపై అనేక రకాలుగా ఇన్వెస్టిగేట్ చేశాయి.

    మరో మలుపు తిరిగింది

    మరో మలుపు తిరిగింది

    ఇక ఇప్పుడు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)ను కూడా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో మలుపు తిరిగింది. ఎక్కడ మొదలైంది.. ఎక్కడకి వెళుతోంది అనే విషయం ఇప్పుడు అందరిలో అనేక సందేహాలను కలిగిస్తోంది. సూసైడ్ చేసుకున్న కోణంలోనే కేసును దాదాపు క్లోజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నెపోటిజమ్ అలాగే డ్రగ్స్ వివాదం చుట్టూ కథనాలు వెలువడ్డాయి.

    రంగంలోకి ఎన్ఐఏ..

    రంగంలోకి ఎన్ఐఏ..

    ముఖ్యంగా డ్రగ్స్ రాకెట్ వైపే ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా కొనసాగడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోలు బ్యూరోలు దర్యాప్తు చేసిన సుశాంత్ కేసులో నాలుగవ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమైంది. జూన్ 14వతేదీన సుశాంత్ మరణించిన విషయం తెలిసిందే. తన ఫ్లాట్ లో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఈ కేసును సీబీఐకు బదిలీ చేయించడంలో బీహార్ ప్రభుత్వం ముఖ్యపాత్ర పోషించింది.

    ఎన్ఐఏకు అప్పగించడానికి కారణం..

    ఎన్ఐఏకు అప్పగించడానికి కారణం..

    సాధారణంగా ఎన్ఐఏ అంటే ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా దానికోసమే ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణా, ఫేక్ కరెన్సీ, సైబర్ ఉగ్రవాద కేసులను డీల్ చేయడం కోసం కూడా చట్టంలో మార్పులు తెచ్చారు. ఇక ఇప్పుడు సుశాంత్ కేసులో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో కేసును ఎన్ఐఏకు మళ్లించినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్..?

    మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్..?

    అండర్ సెక్రటరీ బిశ్వజిత్ సర్కారు సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూన్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్, వంటి పరిమాలతో పాటు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తి కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు.

    English summary
    Actress Rhea Chakraborty files for bail after 14 days in judicial custody. Bollywood actors including actors Taapsee Pannu, Swara Bhasker, and filmmaker Anubhav Sinha, have criticised mediapersons mobbing actor Rhea Chakraborty,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X