ప్రైవేట్ పార్ట్ ఆకారంలో కేక్.. ఛీ చీ సిగ్గులేదా.. నటి బర్త్ డే సెలెబ్రేషన్స్‌పై నెటిజన్స్ ఫైర్
సోషల్ మీడియాలో ఒక్కోసారి ఏది వైరల్ అవుతుంది.. ఏది ట్రోల్‌కు గురవుతుందో చెప్పడం కష్టం. దానికి తగ్గట్టు సెలెబ్రిటీలు సైతం తక్కువేమి తినలేదు. సమయం సందర్భం మంచీ చెడు వంటివి చూసుకోకుండా తమ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. అసలే బాలీవుడ్ మొత్తం అట్టుడికిపోతోంది. డ్రగ్స్ వివాదం, జయాబచ్చన్, కంగనా రనౌత్, ఊర్మిళ, రియా చక్రవర్తి ఇలా ఎన్నో విషయాలు బాలీవుడ్‌ను చుట్టుముట్టాయి. తాజాగా ఓ నటి చేసిన పనికి ఆమెనే కాకుండా బాలీవుడ్ మొత్తాన్ని ఏకిపారేస్తున్నారు.

నాగిని ఫేమ్..
నాగిని సీజన్ 4 నటి నియా శర్మపై ప్రస్తుతం నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆమె చేసింది ఏమిటంటే.. పుట్టిన రోజు నాడు ఆమె కట్ చేసిన కేక్ వివాదంగా మారడం. ఆమె తన స్నేహితులతో తన 30వ బర్త్ డే వేడుకులను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. అంత వరకు బాగానే ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతోనే సమస్య మొదలైంది.

ప్రైవేట్ పార్ట్ ఆకారంలో..
ఆ కేక్‌పై మగవారి ప్రైవేట్ పార్ట్ ఆకారంలో ఉండే కేక్‌ను డిజైన్ చేసి పెట్టారు. ఇక దాన్ని చూసిన నియా షాక్ అయింది. తెగ నవ్వుకుంది. అలానే దాని చుట్టూ ఉన్న క్యాండిల్స్‌ను ఆర్పేసింది. ఈ మేరకు నియా పోస్ట్ చేస్తూ.. నా ముప్పైవ పుట్టిన రోజు వేడుకలు డర్టీగాజరిగాయి. మాటల్లో చెప్పలేం.. ప్రేమకు పొంగిపోయాను అంటూ తన ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి చెప్పుకొచ్చింది.
వీడియోపై ఫైర్..
నియా షేర్ చేసిన ఆ వీడియోలోని కేక్, నియా నవ్వు, అందరూ కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వీరినే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని కలిపి తిడుతున్నారు. మీ లాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే అలా తయారైందని నియాను ఏకిపారేస్తున్నారు.
Recommended Video

నిన్ను చూస్తే సిగ్గేస్తోంది..
నీకు నేను పెద్ద అభిమానిని కానీ ఈ వీడియో చూశాకా ఆ గౌరవం పోయింది.. ఛీ చీ నీకు సిగ్గులేదా? నిన్ను చూస్తే అసహ్యం వేస్తోందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అందులో ఆమె తప్పు ఏముంది.. స్నేహితులు తెచ్చిన కేక్‌ను కట్ చేసింది.. అంటూ నియాను సపోర్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











