మీరు చాలా సెక్సీగా ఉన్నారు, సింగిల్‌గా ఎందుకున్నారు.. షాక్ ఇచ్చిన హాట్ బ్యూటీ ఆన్సర్!
బుల్లితెరతో బాగా పాపులర్ అయిన సెక్సీ బ్యూటీ నియా శర్మ సోషల్ మీడియాలో కుర్రాళ్ళ కలల రాణి. ఆసియాలోనే 3 వ హాటెస్ట్ గర్ల్ గా నియా శర్మ పాపులర్ అయింది. టివి సీరియల్స్ లో క్యూట్ గా నటించిన నియా శర్మ.. విక్రమ్ భట్ తెరకెక్కించిన ట్విస్టెడ్ అనే వెబ్ సిరీస్ లో ఘాటు అందాలతో రెచ్చిపోయి నటించింది. దీనితో నియా బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

హాట్ టాపిక్
తాజాగా సోషల్ మీడియాలో నియా శర్మ పెట్టిన పోస్ట్ ఒకటి నెటిజన్లని ఆలోచనలో పడేసింది. సోషల్ మీడియాలో చాట్ లో భాగంగా నియా శర్మ ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది.

మీరు చాలా సెక్సీగా
ఓ నెటిజన్ నుంచి నియా శర్మకు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు చాలా సెక్సీగా ఉన్నారు. ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నారు అంటూ తనకు ఎదురైన ప్రశ్నని ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది. ఈ ప్రశ్నకు నియా ఇచ్చిన సమాధానం కూడా ఆశ్చర్యపరిచింది. నేను సింగిల్ గా ఉన్నానని మీకు ఎవరు చెప్పారు అంటూ సమాధానం ఇచ్చింది.

డేటింగ్
నియా సమాధానంతో నెటిజన్లలో డేటింగ్ ఊహాగానాలు మొదలైపోయాయి. ఇంత వరకు నియా ప్రేమలో ఉన్నట్లు ఎక్కడా వార్తలు రాలేదు. ఈ హాట్ బ్యూటీ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరు అని ఆరాతీయడం మొదలు పెట్టారు.

మిలియన్ల కొద్దీ
నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో రెండు మిళియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ హాట్ బ్యూటీ అందాల ఘాటు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బికినీలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేయడం ఈ భామకు అలవాటే.


Click it and Unblock the Notifications











