భర్త పైకి ‘బ్రా’ విసిరిన లేడీ అభిమాని: ప్రియాంక ఎలా రియాక్ట్ అయ్యారంటే..
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. నిక్ జోనస్‌తో పాటు లైవ్ షోల్లో పాల్గొంటూ ప్రియాంక కూడా సందడి చేస్తున్నారు. ఇటీవల నిక్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా... ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
నిక్ జోనస్ అంటే ఇష్టపడే ఓ లేడీ అభిమాని... లైవ్ షో జరుగుతుండగా తన 'బ్రా' తీసి అతడి మీదకు విసిరింది. ప్రియాంక ముందే ఆ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆ సమయంలో ఆమె స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.
‘బ్రా' తీసి భర్తకు అందించింది
నిక్ జోనస్ అభిమాని విసిరిన బ్రా తన ముందు పడటంతో... దాన్ని తీసి తన భర్తకు ప్రియాంక స్వయంగా అందించడం చర్చనీయాంశం అయింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్ఏలో జరిగే మ్యూజిక్ లైవ్ షోలలో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. అందుకే ప్రియాంక కూడా ఈ సీన్ చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. పైగా అలాంటి పనులు చేస్తున్న అభిమానుల ఎంకరేజ్ చేస్తూ ఆ బ్రాను నిక్ జోనస్‌కు అందించింది.

గర్వంగా ఉందంటూ ఫోటో షేర్ చేసిన ప్రియాంక
నిక్ జోనస్ తన సోదరులతో కలిసి చేసిన మ్యూజిక్ కాన్సెర్టుకు హాజరు కావడం ప్రియాంకకు ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె వారితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ‘జోనస్ బ్రదర్స్ షోకు తొలిసారిగా హాజరయ్యాను. ఈ షో ఎంతో అద్భుతంగా ఉంది. వీరి ఫ్యామిలీలో భాగం కావడం గర్వంగా ఉంది' అంటూ ప్రియాంక వ్యాఖ్యానించారు.
పాట ద్వారా భార్యకు ఐ లవ్ యూ చెప్పిన నిక్
నిక్ తన మ్యూజిక్ షో కొనసాగిస్తూనే... సంగీత భాషలో భార్యకు ఐ లవ్ యూ చెప్పడం గమనార్హం. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంకను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో అభిమానుల సాక్షిగా చెప్పే ప్రయత్నం చేశాడు నిక్ జోనస్.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత బాలీవుడ్లో నటించిన ‘ది స్కై ఈజ్ పింక్' చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రానికి సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ మూవీ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











