For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: స్టార్ హీరోయిన్‌కు ఊహించని అనుభవం.. స్టేజ్‌పైనే ముద్దుల్లో ముంచేశాడు.!

    By Manoj
    |

    ఒకటి కాదు.. రెండు కాదు.. భారతదేశంలోని చాలా భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అందంతో పాటు అభినయంలోనూ రాణిస్తూ.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుంది. ఈ క్రమంలోనే భారీగా రెమ్యూనరేషన్ తీసుకుని ఇండియన్ ఫిల్మ్ రికార్డులను తిరగరాసింది. ఇండియాలోనే కాదు.. అమెరికా వెళ్లి హాలీవుడ్‌లోనూ నటించింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. తర్వాత ఆమె ప్రేమ వివాహం చేసుకుని అక్కడే స్థిరపడిపోయింది. తాజాగా ప్రియాంకకు ఓ ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏమైంది.? వివరాల్లోకి వెళితే...

    అప్పటి నుంచి దొరికిపోతూనే ఉన్నారు

    అప్పటి నుంచి దొరికిపోతూనే ఉన్నారు

    ప్రియాంక చోప్రా.. ప్రముఖ సింగర్ నిక్ జోనస్‌ అనే సింగర్‌ను ప్రేమ వివాహమాడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్న సమయం నుంచే రొమాన్స్ చేస్తూ దొరికిపోతున్నారు. వివాహం తర్వాత కూడా ఎన్నోసార్లు పబ్లిక్‌ ప్లేస్‌లలో ముద్దులాడుకుంటూ కెమెరాల కంటికి చిక్కుతున్నారు. ఈ క్రమంలోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

     అక్కడికి వెళ్లి మారిపోయిన ప్రియాంక

    అక్కడికి వెళ్లి మారిపోయిన ప్రియాంక

    ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంక ఇక్కడ ఎంతో హుందాగా కనిపించేది. ఎప్పుడైతే హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిందో.. అప్పటి నుంచి అమ్మడి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఫారెన్ కల్చర్‌కు అలవాటు పడిన ఈమె.. డ్రెస్సింగ్‌లోనూ ఎంతో మారిపోయింది. అలాగే, సిగరెట్లు కాల్చడం వంటి వాటితో ట్రోలర్స్ బారిన పడుతోంది.

    పెళ్లి తర్వాత బాగా తగ్గించేసింది

    పెళ్లి తర్వాత బాగా తగ్గించేసింది

    గతంలో ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపింది హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అయితే, వివాహం తర్వాత మాత్రం ఆమె స్పీడు తగ్గించేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి డిజిటల్ మీడియా సంస్థల్లో కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించేందుకు సంతకాలు చేసింది.

    స్టార్ హీరోయిన్‌కు ఊహించని అనుభవం

    నిక్ జోనస్.. తన సోదరులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో లైవ్ కన్సర్ట్‌ను నిర్వహించాడు. దీనికి ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. ప్రోగ్రాం చివర్లో నిక్.. ఆమెను స్టేజ్‌పైకి ఆహ్వానించాడు. ఆమె పైకి వచ్చిన వెంటనే హగ్ చేసుకున్న నిక్.. వెంటనే ముద్దులాటను ప్రారంభించాడు. తన భర్త వ్యవహరించిన తీరుకు ప్రియాంక షాకైనట్లు వీడియోలో కనిపించింది.

     అప్పుడు కూడా వేల మంది ముందు ముద్దు

    అప్పుడు కూడా వేల మంది ముందు ముద్దు

    కొద్ది రోజుల క్రితం అమెరికాలో ప్రియాంక భర్త నిక్.. అతడి సోదరులు కలిసి ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఆమె కూడా హాజరైంది. షో ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో వేల మంది చూస్తుండగానే నిక్.. ప్రియాంక పెదాలను ముద్దాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

    English summary
    Nicholas Jerry Jonas is an American singer, songwriter and actor. Jonas began acting in theater at the age of seven, and released his debut single in 2002 which caught the attention of Columbia Records where Jonas formed a band with his older brothers, Joe and Kevin, known as the Jonas Brothers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X