వేల మంది ముందే ముద్దు.. స్టార్ హీరోయిన్‌కు ఊహించని అనుభవం

ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్‌తో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత నిక్ - ప్రియాంక తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

 పూర్తిగా మారిపోయింది

పూర్తిగా మారిపోయింది

హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైంది. అందుకే ఆమె కొద్ది రోజులుగా వార్తల్లోనే నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె ప్రవర్తిస్తున్న తీరుకు నెటిజన్లు షాకైపోతున్నారు.

 బహిరంగంగా ముద్దు పెట్టుకుని

బహిరంగంగా ముద్దు పెట్టుకుని

ఈ జంట పెళ్లైన కొత్తలో ఓ బహిరంగ ప్రదేశంలో ముద్దుపెట్టుకుంటూ కెమెరాల కంటికి చిక్కింది. ఆ సమయంలో అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమె ఎన్నో సార్లు ఇలా ట్రోల్స్ బారిన పడుతూనే ఉంది.

విపరీతంగా ట్రోల్స్

కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త, మరికొందరితో కలిసి సిగరెట్ కాల్చింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. గతంలో దీపావళి సందర్భంగా ఆమె చేసిన ఒక వీడియోను గుర్తు చేస్తూ ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.

వేల మంది ముందు ముద్దు

వేల మంది ముందు ముద్దు

అమెరికాలోని ఓ ఆడిటోరియంలో జోనస్ బ్రదర్స్ ఈవెంట్‌ను నిర్వహించారు. తన భర్త ప్రదర్శనను చూసేందుకు ప్రియాంక అక్కడకు వచ్చింది. వీఐపీ గ్యాలరీలో నుంచి ఆమె షోను తిలకించింది. షో అనంతరం జోనస్ బ్రదర్స్ వీఐపీ గ్యాలరీ నుంచే బయటకు వెళ్లారు. ఆ సమయంలో నిక్.. ప్రియాంకకు లిప్ కిస్ ఇచ్చాడు. కళ్లు మూసి తెరిచే లోగా ఇది జరిగిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X