For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియాంకకు అదిరిపోయే గిప్ట్.. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసిన భర్త

|

ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది ప్రియాంక చోప్రా. భారతదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో ఆమె సినిమాలు చేసింది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. ఇక్కడ షూటింగ్ లేని సమయంలో ఇప్పుడు భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది.

ప్రియాంక - నిక్ డేటింగ్ చేసిన సమయం నుంచే తరచూ వార్తల్లో నిలిచే వారు. ఇక వివాహం జరిగిన తర్వాత ప్రియాంకలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. గతంలో పబ్లిక్‌లో భర్తను లిప్ లాక్ ఇవ్వడం వంటివి చేసింది. ఇది అక్కడ సర్వసాధారణమే అయినా.. మన దేశంలో కాదు కాబట్టి ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయినా, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఆమె నిరంతరం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

Nick Jonas To Plan Surprise Gift For Priyanka Chopra

తాజాగా నిక్ - ప్రియాంక గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది బీ టౌన్‌లో చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటనే కదా మీ సందేహం.? డిసెంబర్ 1న ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోనుంది. దీనిని వీళ్లిద్దరూ కలిసి గ్రాండ్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిక్.. ప్రియాంకకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ బహుమతిని ఇవ్వబోతున్నాడట. ఇంతకీ ఆ బహుమతి ఏంటని బాలీవుడ్ వర్గాలతో పాటు ప్రియాంక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ 2018 డిసెంబర్ 1న రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత ముంబయిలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరై దంపతులను ఆశీర్వదించారు.

English summary
Nicholas Jerry Jonas is an American singer, songwriter and actor. Jonas began acting in theater at the age of seven, and released his debut single in 2002 which caught the attention of Columbia Records where Jonas formed a band with his older brothers, Joe and Kevin, known as the Jonas Brothers.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more