ఆఫర్ల కోసం లంచాలు ఇచ్చా .. ఒక్కో రోల్‌కి ఎంతంటే? నిహారిక షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో ధ్రువతారలా వెలిగిపోవాలని దేశం నలుమూలల నుంచి ఎన్నో కలలు, లక్ష్యాలతో యువతీ యువకులు హైదరాబాద్, ముంబై, చెన్నై లాంటి నగరాలలో అడుగు పెడుతుంటారు. కానీ ఇక్కడ అవకాశాలు దక్కించుకోవడం అంత ఈజీ కాదని తర్వాత వారికి అర్ధమవుతుంది. ఛాన్స్‌లు ఇప్పిస్తామని అమ్మాయిల్ని లోబరచుకునేవారు, వ్యభిచార కూపంలో దించే ముఠాలు అడుగడుగునా మాటు వేసి ఉంటాయి. ఆఫర్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బు దోచుకుని మోసం చేసేవారు మరికొందరు. ఇలాంటి మోసానికే గురయ్యారు బాలీవుడ్ నటి నిహారిక. ఈ వివరాల్లోకి వెళితే..

13 ఏళ్ల వయసులోనే ఎంట్రీ
మధ్యప్రదేశ్‌లో బుర్హాన్‌పూర్‌కు చెందిన నిహారిక చౌక్సేకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి.. ఇందుకోసం 12వ తరగతి చదువుతున్నప్పుడే ముంబై రైలు ఎక్కేసింది. 13 ఏళ్ల వయసులోనే ఎహా హై మొహబ్బతిన్ అనే సీరియల్‌లో గెస్ట్ రోల్ చేసింది. తర్వాత ఎహా రిస్తా క్యా కెహ్లాతా హై, ఫాల్తూ, ఆయేనా రూప్ నహి, హఖీక్త్ బి దిఖాయే సీరియల్స్‌తో హిందీ టెలివిజన్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది. నటిగా పాపులర్ కావడంతో ఆమెకు సినిమాలలోనూ ఆఫర్లు వచ్చాయి. జన్‌హిత్ మైన్ జారీ, జహాన్ చార్ యార్, ఏ వింటర్ టేల్ ఎట్ సిమ్లా సినిమాలలో నిహారిక నటించారు.

Niharika Chouksey Revealed casting scams in Film Industry

ఆ నటుడితో 27 ఏళ్ల ఏజ్ గ్యాప్
చిన్న వయసే అయినా కుండబద్ధలు కొట్టడం ఆమె స్టైల్. తుమ్ సే తుమ్ తక్ సీరియల్‌లో నటుడు శరద్ కేల్కర్‌కు నాతో 27 సంవత్సరాల ఏజ్ గ్యాప్ గురించి గట్టిగా కౌంటర్ ఇచ్చింది నిహారిక. ఈ సీరియల్‌లో 19 ఏళ్ల అను.. 46 ఏళ్ల వ్యాపారవేత్త ఆర్యవర్ధన్ మధ్య జరిగే ప్రేమాయణాన్ని చూపించారు. పబ్లిసిటీ ఏదైనా మంచిదేనని వ్యాఖ్యానించారు. ట్రైలర్‌ను చూసి అంచనాకు రావొద్దని.. ఎపిసోడ్ చూసిన తర్వాతే వారే అను, ఆర్యన్‌లను ఇష్టపడతారని నిహారిక వ్యాఖ్యానించారు. శరద్ సార్ నుంచి ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నానని.. ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారని, ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఓర్పుగా ఉంటారని ఆమె తెలిపారు.

ఆఫర్ల పేరుతో మోసాలు
కాగా.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకు అవకాశాలు అంత త్వరగా రాలేదని, పలువురు ఆఫర్ల పేరుతో తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని నిహారిక సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ ఉచ్చులో పడ్డానని, చివరికి ఆడిషన్స్ రిజిష్ట్రేన్లకు కూడా ఫీజు చెల్లించమని తనను అడిగిన సందర్భాలు ఉన్నాయని నిహారిక గుర్తు చేసుకున్నారు. బుర్హాన్‌పూర్ నుంచి మధ్యప్రదేశ్‌లో అడుగుపెట్టినప్పుడు నాకు ఒకే ఒక ఉందని.. ఈ దారిలో నన్ను ఎంతోమంది మోసం చేయడానికి చూశారని చెప్పింది. క్యారెక్టర్, యాక్టర్ కార్డ్ వంటివి ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని తర్వాత ముఖం చాటేసేవారని నిహారిక తెలిపింది.

అమ్మ ఎందుకు అని ప్రశ్నించారు
ముంబైలో ముఖ్కు ముఖం తెలియకపోవడం వల్లే ఈ మోసాలకు గురయ్యానని చెప్పింది. ఒకసారి ఆడిషన్ల కోసం ఓ క్యాస్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి 30 వేలు చెల్లించానని, యాక్టర్ కార్డ్ కోసం 3000 కూడా ఇచ్చానని నిహారిక తెలిపింది. ఇవి ఇక్కడితో ఆగలేదని, అవకాశాల పేరుతో తనకు మోసపూరిత ఆఫర్లు కూడా వచ్చాయని తెలిపారు. ఆఫర్లు ఇస్తే మాకేంటీ అని నేరుగా అడిగేవారని, కానీ మా అమ్మ ప్రతిక్షణం తోడుగా ఉండేదని నిహారిక పేర్కొన్నారు. నా ఆడిషన్లింటికీ ఆమె నాతో పాటు రావడంతో .. మీ అమ్మ ప్రతిసారి నీతో ఎందుకు వస్తుందని క్యాస్టింగ్ డైరెక్టర్లు అడిగేవారని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెనక్కి వచ్చేయమని నా తల్లిదండ్రులు ముందు నుంచి స్వేచ్ఛను ఇచ్చారని నిహారిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X