నుస్రత్ ఆరోపణలు నిజం కాదు.. నేను ఇంకా ఆమెను ప్రేమిస్తున్నా.. ఓపెన్ అయిన నిఖిల్ జైన్

బెంగాలీ సినిమాల నటి మరియు తృణమూల్ కాంగ్రెస్ యొక్క లోక్‌సభ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ , తన మాజీ భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడం, సహ నటుడు యష్ దాస్‌గుప్తాతో ఎఫైర్ ఆ తరువాత కొడుకుకు జన్మనిచ్చిన కారణంగా చాలా కాలంగా వార్తల్లో ఉంది. నుస్రత్ జహాన్ నుంచి విడిపోయిన తర్వాత, నిఖిల్ జైన్ మొదటిసారిగా బహిరంగంగా బయటకు వచ్చి, నుస్రత్‌తో తన సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన నిఖిల్ జైన్, ప్రస్తుతం తన మాజీ భార్య నుస్రత్ జహాన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఒక హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.

నిఖిల్ జైన్ నుంచి విడిపోయిన తర్వాత నుస్రత్ అతనిపై పలు ఆరోపణలు చేసింది. నిఖిల్ జైన్ ద్విలింగ సంపర్కుడని కూడా ఆమె చేసిన ఆరోపణల్లో ముఖమైనది. అయితే తాజా ఇంటర్వ్యూలో, తాను బైసెక్సువల్ అని నుస్రత్ చేసిన ఆరోపణలను నిఖిల్ ఖండించాడు. నిజానికి జూన్ 2019లో టర్కీలోని బోర్డమ్‌లో నుస్రత్ జహాన్ నిఖిల్ జైన్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే ఏడాది వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీని తర్వాత నుస్రత్ నిఖిల్ జైన్ నుండి విడిపోయింది. అంతే కాక ఆమె ఈ వివాహాన్ని గుర్తించనని ఎందుకంటే తమ వివాహం టర్కీలో జరిగిందని, ప్రత్యేక వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు కాలేదని నుస్రత్ తెలిపారు. కాబట్టి ఈ వివాహం భారతదేశంలో చట్టబద్ధంగా చెల్లదాని వాదించింది. ఆ తర్వాత నుస్రత్ జహాన్ బెంగాలీ చిత్రాల నటుడు యష్ దాస్‌గుప్తాతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడం ప్రారంభించింది.

Nikhil Jain Opens up about nusrat jahans allegations on him

అలా నుస్రత్ జహాన్ ఆగస్టు నెలలో ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఈ కొడుకు తండ్రి యష్ దాస్‌గుప్తా కాగా నుస్రత్ కొడుకుకు యేషాన్ జె దాస్‌గుప్తా అని పేరు పెట్టారు. అంతకు ముందే నుస్రత్ నిఖిల్ జైన్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధంలో లేనని వెల్లడించింది. అప్పుడే నిఖిల్ జైన్ కూడా తాను బిడ్డకు తండ్రి కాదని చెప్పారు. తమ వివాహాన్ని రద్దు చేసినందుకు ఈ ఏడాది మార్చి 8 న నిఖిల్ జైన్ కూడా నుస్రత్‌పై సివిల్ దావా వేశారు. మరో విషయం ఏమిటంటే నుస్రత్ జహాన్ నుండి విడిపోయిన నిఖిల్ జైన్ కూడా నటి మరియు చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. నిఖిల్ మాట్లాడుతూ, 'మా మధ్య విభేదాలు ఉండవచ్చు, అప్పుడే పుట్టిన శిశువు మరియు తల్లికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బేబీ ఉజ్వల భవిష్యత్తు కోసం నేను ప్రార్థిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X