Divorce: ఐశ్వర్యతో విడాకులు.. అభిషేక్‌తో నాది రిలేషన్‌షిప్ అదే తేల్చేసిన నిమ్రత్ కౌర్
బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకుల రూమర్లు మీడియాలో కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. అలాగే అభిషేక్‌తో హీరోయిన్ నిమ్రత్ కౌర్ అఫైర్ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇలాంటి విషయాలు గురించి ఈ ముగ్గురు కూడా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే తాజాగా తన డేటింగ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేందుకు నిమ్రత్ కౌర్ నర్మగర్భంగా చేసిన పోస్టు వైరల్ అయింది. ఆ వైరల్ పోస్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఐశ్వర్యరాయ్‌తో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకొంటున్నారనే వార్తల నేపథ్యంలో నమ్రత్ కౌర్ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. అయితే ఐశ్వర్యను చీట్ చేసేలా అభిషేక్‌తో ఆమె అఫైర్ కొనసాగిస్తున్నది. దస్వీ సినిమా షూటింగులో జరిగిన పరిచయం ప్రేమగా మార్చుకొన్నది అనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి వరకు ఎవరో తెలియని నిమ్రత్ కౌర్ భారీ పాపులారిటీ సంపాదించుకొన్నది.

అయితే అటు ఐశ్వర్య విడాకులు గానీ, అలాగే నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ డేటింగ్ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ స్పందించకపోవడంతో రకరకాల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఈ వ్యవహారంపై బిగ్ బీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రూమర్లలో వాస్తవం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. నిమ్రత్ కూడా ఎందుకు ఖండించడం లేదనే అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా నిమ్రత్ ఇలాంటి వివాదానికి దూరంగా ఉండాలి. ఇది రెండు జీవితాల సమస్య కాబట్టి. రూమర్లు వచ్చినప్పుడు వాటికి జవాబుదారీగా ఉండాలి. భార్యను చీట్ చేసే వ్యక్తి అభిషేక్ కాదు. తన పెళ్లి జీవితానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిని ఎందుకు నిరాకరిస్తాడు. కాబట్టి ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయకండి అని బిగ్ బీ పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిమ్రత్ కౌర్ తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో ఓ సూక్తిని పెట్టి నర్మగర్బంగా తన డేటింగ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. మా జీవితంలో మా జర్నీ చాలా బలంగా ఉంది. అయితే మేము తక్కువగా అటాచ్ అయి ఉన్నాం అంటూ ప్రముఖ అమెరికన్ ఆధ్యాత్మిక గురువు రామ్ దాస్ అలియాస్ రిచర్డ్ అల్పర్ట్ సూక్తిని పోస్టు చేసి తన బంధాన్ని గురించి చెప్పేప్రయత్నం చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











