Nimrat kaur: నటికి చేదు అనుభవం.. 90 గంటలు మానసికంగా ఒత్తిడికి గురైనట్లు ఆవేదన
అప్పుడు పలు రవాణా సంస్థలు చేసే పనులు చిర్రెత్తుకు వచ్చేలా చేస్తాయి. సాధారణ మనుషులతోనే కాకుండా సెలబ్రిటీల పట్ల సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయి. జాగ్రత్తగా మెలగాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తాయి. అయితే వీటి బాధ్యాతరాహిత్యంపై సాధారణ మనుషులు సైలెంట్‌గా ఉంటారేమో గానీ, సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తారు. లేదా కొంతమంది ఆవేదనతో విషయం తెలియజేస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఓ ప్రముఖ నటికి విమాణ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్త పరిచింది.
నిమ్రత్ కౌర్.. బాలీవుడ్ పాపులర్ నటీమణుల్లో ఒకరు. హిందీ సినిమాలు, షార్ట్ ఫిల్మ్శ్, మ్యూజిక్ వీడియోస్లలోనూ నటించింది నిమ్రత్ కౌర్. అంతేకాకుండా అమెరికా టెలివిజన్‌లో ప్రసారమయ్యే సిరీస్‌లలో నటించి పాపులారిటీ సంపాదించుకుంది.

ఎయిర్ లిఫ్ట్‌లో..
మోడల్‌గా, నటిగా.. ఇటు భారత్, అటు అమెరికాలో గుర్తింపు పొందింది నిమ్రత్ కౌర్. రాజస్థాన్‌కు చెందిన నిమ్రత్ కౌర్ 2002లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్ సరసన ఎయిర్ లిఫ్ట్‌లో, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో ది లంచ్ బాక్స్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.

చివరిగా దస్వీ..
అలాగే అమెరికన్ టెలివిజన్ సిరీస్ హోమ్ల్యాండ్లో కూడా నటించి అక్కడ గుర్తింపు తెచ్చుకుంది. నిమ్రత్ కౌర్ చివరిగా అభిషేక్ బచ్చన్ నటించిన పొలిటికల్, కామెడీ థ్రిల్లర్ దస్వీ చిత్రంలో అలరించింది. యామీ గౌతమ్‌తోపాటు నిమ్రత్ కౌర్ పాత్రకు మంచి ప్రాధాన్యత లభించింది.

లగేజ్ బ్యాగ్ మిస్..
ఇదిలా ఉంటే తాజాగా నిమ్రత్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా ఎయిర్ లైన్ డెల్టాలో ఇండియాకు వచ్చింది నిమ్రత్ కౌర్. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో తన లగేజ్ బ్యాగ్ ఒకటి మిస్ కాగా, మరొకటి డ్యామేజ్ అయింది.

మరొకటి డ్యామేజ్..
ఇదే విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేస్తూ డ్యామేజ్ అయిన బ్యాగ్ ఫొటోలను షేర్ చేసింది. ''డెల్టా ఎయిర్ లైన్ సిబ్బంది నా లగేజ్‌ను ఎక్కడో మిస్ చేసింది. అలాగే మరొక బ్యాగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. దీంతో నేను 90 గంటలకుపైగా తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యాను.

నిమ్రత్ కౌర్ ఆవేదన..
ఈ విషయంలో డెల్టా సంస్థ బాధ్యాతారాహిత్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా డెల్టా సంస్థ దీనిపై స్పందించి మిస్ అయిన నా లగేజ్ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి నాకు చేర్చాలని కోరుకుంటున్నా'' అని నిమ్రత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది.

స్పందించిన డెల్టా..
ఈ ట్వీట్‌పై స్పందించిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఆమె ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, అప్పటివరకు తమతో సహకరించాలని నిమ్రత్ కౌర్‌ను విజ్ఞప్తి చేసింది. కాగా 1982 మార్చి 13న, రాజస్థాన్‌లోని పిలనిలో జన్మించింది ఈ బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్.


Click it and Unblock the Notifications











