Divorce: ఐశ్వర్య విడాకుల రూమర్లు..అభిషేక్‌తో అఫైర్‌పై నిమ్రత్ కౌర్ హింట్ .. శ్రద్దాకపూర్ కామెంట్ వైరల్!
ఇండియన్ సినిమా రంగంలో అత్యధికంగా హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ నిమ్రత్ కౌర్. సినిమాల పరంగా ఆమె గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం లేదు కానీ.. అత్యంత వివాదాస్పదమైన ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతో నిమ్రత్ పేరు మార్మోగిపోతున్నది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్, క్రేజ్ లభిస్తున్నది. తాజాగా అభిషేక్‌తో రిలేషన్‌షిప్‌కు బలమిచ్చేలా ఆమె పోస్టు చేసిన వీడియోపై శ్రద్దాకపూర్ లాంటి ప్రముఖులు కూడా స్పందించడంతో వైరల్ అయింది. ఆ వివారాల్లోకి వెళితే..
నిమ్రత్ కౌర్ ఎవరు?
హీరోయిన్ నిమ్రత్ కౌర్ విషయానికి వస్తే.. రాజస్థాన్‌లోని పిలానీ ప్రాంతంలో సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు. హిందీ సినిమా రంగంలోను, అలాగే అమెరికన్ టెలివిజన్ రంగంలోను రాణించారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన పెడ్లర్ సినిమా ద్వారా గుర్తింపు పొందారు. అనంతరం లంచ్ బాక్స్ సినిమాతో అవార్డులకు ఎంపికయ్యారు.

అభిషేక్‌తో కలిసి మూవీ
బాలీవుడ్, హిందీ సినిమాలో నిమ్రత్ కౌర్ నటించిన సినిమాలు అసలు ప్రాచుర్యం పొందకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. 2022 సంవత్సరంలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించిన దస్వి మూవీలో నటించారు. ఈ సందర్భంగానే వారిద్దరి మధ్య పరిచయం వారిని సన్నిహితంగా మార్చింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకులకు వారి బంధమే కారణమనే రూమర్లను క్రియేట్ చేసింది.
చోటా బచ్చన్‌తో అఫైర్ గురించి
నిమ్రత్ కౌర్‌తో బంధం గురించి అభిషేక్ మౌనంగా ఉంటూ వస్తున్నారు. అలాగే చోటా బచ్చన్ రిలేషన్ గురించి ఆమె కూడా పెదవి విప్పకపోవడంతో అసలు వారిద్దరి మధ్య బంధం ఉందా? లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా అభితో ప్రేమను సూచించే విధంగా పాటతో వీడియోను రిలీజ్ చేయడంతో మళ్లీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీపావళీ పండగ కోసం పోస్టుతో
అయితే దీపావళీ సందర్భంగా పోస్టు చేసిన వీడియోలో నిమ్రత్ కౌర్.. పర్యావరణానికి అనుకూలంగా ఉండే పూల్ జడీ (టపాసు) అంటూ తనకు తాను కామెంట్ చేసుకొన్నది. ఆమె చేసిన కామెంట్‌పై శ్రద్దాకపూర్ కూడా కామెంట్ చేయడంతో ఆ వీడియో మరింత వైరల్ అయింది. నువ్వు 365 రోజులు పేలే టపాసు లాంటి పూల్ జడీ అని కామెంట్ చేసింది.
ఏది అనుకొంటే అది చేస్తా!
ఇటీవల నిమ్రత్ కౌర్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. నన్ను మా అమ్మాయిలా పెంచేలేదు. ఓ కొడుకు మాదిరిగా పెంచారు. అందుకే నేను ఏం చేయాలంటే అది చేసేస్తాను. దేనికి వెనుకాడను. ఆడ, మగ అనే లింగ వివక్ష లేకుండా పెరిగాను. నా మైండ్‌లో ఏది వస్తే.. అది చేస్తాను అని నిమ్రత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











