twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యురి' సినిమా చూసి భావోద్వేగంతో.. థియేటర్‌లోనే నినాదాలు చేసిన కేంద్ర మంత్రి!

    |

    Recommended Video

    'యురి' సినిమా చూసి థియేటర్‌లోనే నినాదాలు చేసిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్!!

    ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'యురి ది సర్జికల్ స్ట్రైక్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 200 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. యురి చిత్రానికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ ఆర్మీ మేజర్ విహాన్ గా ప్రధాన పాత్రలో నటించాడు. యామి గౌతమ్, మోహిత్ రైనా, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా భారత రక్షణ శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    హౌ ఈజ్ ది జోష్

    హౌ ఈజ్ ది జోష్

    చిత్ర యూనిట్ నిర్మల సీతారామన్ కు బెంగుళూరులో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారు. నిర్మల సీతారామన్ తో పాటు మాజీ ఆర్మీ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా యురి చిత్రాన్ని వీక్షించారు. చిత్రం ముగిసిన అనంతరం నిర్మల సీతారామన్ లో ఉత్సాహం, భావోద్వేగం ఒకేసారి బయటకు వచ్చాయి. థియేటర్ లోనే 'హౌ ఈజ్ ది జోష్' అంటూ నిర్మల సీతారామన్ గట్టిగా నినాదాలు చేశారు. ఆమెతో ఆర్మీ అధికారులు కూడా గొంతు కలిపారు.

    హీరో కన్నా మీరే

    ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'హౌ ఈజ్ ది జోష్' అనేది హీరో విక్కీ కౌశల్ ఆర్మీ కమాండర్స్ ని ఉత్తేజ పరచడానికి చెప్పే డైలాగ్. హీరో కన్నా మీరే బాగా చెప్పారు మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సినిమా పూర్తి కాగానే ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలతో థియేటర్ మారుమోగిపోయింది. నిర్మల సీతారామన్ కూడా ఉత్సాహంగా నినాదాలు చేశారు.

    బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రయిక్.. యూరీ మెరుపు కలెక్షన్లు..పాక్‌పై దాడి మాదిరిగానే!బాక్సాఫీస్‌పై సర్జికల్ స్ట్రయిక్.. యూరీ మెరుపు కలెక్షన్లు..పాక్‌పై దాడి మాదిరిగానే!

    బ్రిలియంట్ పెర్ఫామెన్స్

    నిర్మల సీతారామన్ చిత్రాన్ని అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. వాట్ ఎ పవర్ ప్యాక్డ్ మూవీ.. విక్కీ కౌశల్, యామిని గౌతమ్, పరేష్ రావల్, మోహిత్ రైనా ఏ చిత్రానికి బ్రిలియంట్ పెర్ఫామెన్స్ అందించారు. ఈ చిత్రాన్ని చూశాక నేను కూడా మరింతగా ఉత్తేజాన్ని పొందాను ని నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో మెరుపు దాడులు జరిపింది.

     తిరుగులేని ప్రతీకారం

    తిరుగులేని ప్రతీకారం

    2016 సెప్టెంబర్ లో పాక్ ఉగ్రమూకలు కొందరు రహస్యంగా ఇండియా బోర్డర్ లోకి ప్రవేశించి యురి ప్రాంతంలోని భారత ఆర్మీ స్థావరాలపై దాడులకు తెగబట్టారు. ఈ ఘటనలో 17 మంది భారత సైన్యం ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం కొద్దీ రోజుల వ్యవధిలోనే తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. పీవోకే లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపిన ఇండియన్ ఆర్మీ .. ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేయడమే కాక, దాదాపు 40 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ మొత్తం గుట్టుచప్పుడు కాకుండా పక్కా ప్రణాళికతో ముగించారు. ఈ సంఘటన ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధార్ చిత్రాన్ని తెరకెక్కించారు.

    English summary
    Nirmala Sitharaman gets excited, says ‘How’s the josh’ while watching ‘Uri: The Surgical Strike’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X