అతన్ని బయటకు లాగితే మొత్తం కక్కుతాడు.. సుశాంత్ డెత్ కేసులో న్యూ ట్విస్ట్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి మూడు నెలలు దాటింది. సూసైడ్ నుంచి మర్డర్ మిస్టరీ వరకు అనేక రకాల ఆరోపణలతో కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఒక్క సుశాంత్ మరణం.. నెపోటిజమ్, డ్రగ్స్, కంగనా పొలిటికల్ వార్ వంటి వివాదాలకు దారి తీసింది. ఇక ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత నితీష్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Sushant Singh Rajput : Sushant,దిశ మరణాల వెనుక టాప్ బిల్డర్.. అసలేం జరిగిందంటే..? || Oneindia Telugu
ఇది ఆత్మహత్య కాదు.. పక్కా మర్డర్

ఇది ఆత్మహత్య కాదు.. పక్కా మర్డర్

సుశాంత్ మరణించిన తరువాత చాలా మంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా సుశాంత్ మృతిపై స్పందించారు. ఇక ఇది ఆత్మహత్య కాదని పక్కా మర్డర్ అంటూ అనుమానాలు కూడా వచ్చాయి. అధికార పార్టీ బీజేపీ కూడా అదే తరహాలో వ్యాఖ్యానించి పలు ఉదాహరణలు కూడా బయటపెట్టింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీష్ రాణె ఒక వ్యక్తి మరొక ట్విస్ట్ ఇచ్చాడు.

నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి

నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి

ఇటీవల రిపబ్లిక్ టీవీలో నిర్వహించిన చర్చల్లో మాట్లాడిన నితీష్ రాణె సుశాంత్ సూసైడ్ పై అనుమానాలను నిజం చేయడానికి తన వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అలాగే అతని మాజీ మేనేజర్ దిశా కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఇద్దరిది కూడా హత్యే. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.

దిశకు చేదు అనుభవం ఎదురైంది

దిశకు చేదు అనుభవం ఎదురైంది

సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను కలిసి త్వరలోనే ఈ ఆధారాలను అందిస్తాను. జూన్ 8న దిశ సూసైడ్ చేసుకుంది. కానీ దానికంటే ముందు ఆమె అయిష్టతతో ఒక పార్టీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొందరి వల్ల దిశకు చేదు అనుభవం ఎదురైంది. అదే విషయాన్ని సుశాంత్ కి చెప్పగా అతను చెడుగా ప్రవర్తించిన వ్యక్గులకు ఫోన్ చేశాడు.

ఆ వ్యక్తి వల్లే దిశ మృతి చెందింది

ఆ వ్యక్తి వల్లే దిశ మృతి చెందింది

అయితే అప్పటికే దిశ తన ఫ్లాట్ కి చేరుకోగా అప్పుడు ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి ఆమె కోసం కాపు కాసాడు. ఆ వ్యక్తి వల్లే సుశాంత్ మాజీ మేనేజర్ దిశ మృతి చెందింది. ఇది జరిగిన రోజు నుంచి సుశాంత్, రియాలు దూరమయ్యారు. మరో ఐదు రోజుల తరువాత సుశాంత్ మృతి చెందాడు.

అతన్ని పట్టుకుంటే.. మొత్తం కక్కుతాడు

అతన్ని పట్టుకుంటే.. మొత్తం కక్కుతాడు

ఇక సుశాంత్ మృతి వెనుక కూడా కొన్ని పెద్ద శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా దిశ బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ని బయటకు లాగితే అసలు విషయాన్ని కక్కుతాడు. అతనికి అన్ని విషయాలు తెలుసు. నేను కూడా అతనితో మాట్లాడాను. కాకపోతే అతనిపై కొన్ని ఒత్తిడిలు ఉన్నట్లు నాకు చెప్పాడు. వీలైనంత త్వరగా రోహన్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే సీబీఐ అధికారులకు ఒక లీడ్ దొరుకుతుంది.. అని నితీష్ రాణె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X