twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వీడియోతో కరణ్ కు సంబంధం లేదు

    |

    బాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సెలబ్రిటీలు, వారి మేనేజర్లను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను విచారించింది. స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే - శ్రద్ధాకపూర్ - సారా అలీఖాన్ లను విచారించింది.

    వీరితో పాటు ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతని ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా గంజాయి, చిన్న మొత్తంలో వీడ్ దొరికినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లక్రితం కరణ్ జోహార్ నివాసంలో ఇచ్చిన ఓ లేట్‌నైట్ పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా పారాయాంటూ తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈ విషయంపై శిరోమణి అకాలీదళ్ లీడర్ మంజిందర్ సింగ్ సిర్సా కంప్లైంట్ ఇవ్వడంతో, ఎన్‌సిబి ఆ వీడియోని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కి పంపింది..

    NO probe on Karan Johars party video - NCB

    ఈ వీడియోలో బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులు మత్తులో జోగడం కనిపించింది. ఒకరిపై ఒకరు వాలిపోతూ వంటిపై స్పృహ ఉందో లేదో అన్పించే రేంజ్‌లో ఊగిపోతూ కన్పించారు. ఇందులో నిజంగా వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నారా? మద్యం తీసుకున్నారా అనేది తేల్చాలంటే ఎంక్వైరీ జరగాల్సిందే. దీంతో కరణ్ జోహార్‌ని ఎన్సీబీ సమన్లు జారీ చేయనుందని వార్తలు వినిపించాయి. కానీ, కరణ్ కు డ్రగ్స్ కు సంబంధాలు ఉన్నాయని తేలలేదని ఎన్సీబీ వివరణ ఇచ్చింది.

    మరోవైపు తాజాగా కరణ్‌ జోహార్‌ సహాయకులు క్షితిజ్‌ ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రాల వద్ద భారీ మొత్తంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని శనివారం కరణ్‌ జోహార్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేస్తున్న వార్తలను ఖండించారు. అనుభవ్‌ చోప్రా 2011-2013 మధ్య తమ సంస్థతో రెండు ప్రాజెక్టుల్లో పని చేసినప్పటికీ.. ధర్మ ప్రొడక్షన్‌లో ఉద్యోగి మాత్రం కాదని కరణ్‌ తెలిపారు.

    English summary
    The Narcotics Control Bureau (NCB) on Saturday confirmed that the agency is not probing the alleged 'drug party' video posted by Bollywood filmmaker Karan Johar, adding that their focus is on the drug-related investigation surrounding the death of Sushant Singh Rajput.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X