'అతడో బాXXర్డ్.. ఆయన చావుకి No Rip'

Neena Gupta: ప్రఖ్యాత జర్నలిస్ట్, చిత్రనిర్మాత ప్రీతిష్ నంది బుధవారం తుది శ్వాస విడిచారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన సన్నిహితులు, సహోద్యోగులు ఎంతో మంది నివాళులు అర్పిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అనుపమ్ ఖేర్ నుండి అనిల్ కపూర్ వరకు చాలా మంది తారలు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతూ పోస్ట్‌లను పంచుకున్నారు. ఒకవైపు ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నిండగా.. మరో వైపు .. ప్రీతిష్ నందిపై ఓ నటి సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించింది. ఇంతకీ నీనా గుప్తా ఏం కామెంట్స్ చేసిందో మీరు కూడా ఓ లూక్కేయండి.

అసలేం జరిగిందంటే.. ప్రొడ్యూసర్ ప్రీతీష్ మరణ వార్త తెలుసుకున్న తరువాత ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. నా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్‌ మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. ఆయన అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత కూడా. ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్‌ ఇచ్చారు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. ఆయన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను' అంటూ ఓ ప్రత్యేక పోస్ట్‌ చేస్తూ.. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు అనుపమ్‌ ఖేర్‌. ఈ పోస్ట్‌ను గమనించిన నీనా గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది.

NO RIP for him Neena Gupta controversial comment on Pritish Nandy after death

బాలీవుడ్ నటి నీనా గుప్తా తన జీవితంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ఆమె తన జీవితంలో ఎన్నో ప్రతి సవాలును ఎదుర్కొన్నారు. తన కూతురు మసాబాను ఒంటరిగా పెంచడం, 65 సంవత్సరాల వయసులో కూడా సినిమాల్లో రాణిస్తోంది. ఆమె తన జీవితంలో ఎన్నో విజయాలను సాధించింది. వాస్తవానికి నటి నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే తన కూతురు మసాబాకు జన్మనిచ్చింది. దీని వల్ల అనేక ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఘటనతో ఎన్నో సార్లు వార్తల్లో హెడ్ లైన్ గా మారింది.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రీతిష్ నంది, నటి నీనా గుప్తా మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడింది. ప్రీతి నంది వివాదాస్పద చర్యల పట్ల నీనా గుప్తా తన ద్వేషాన్ని వ్యక్తం చేసింది. గతంతోనూ ఆమె ఆయనపై పలు ఆరోపణలు చేసింది. తాజాగా అతను మరణించిన తర్వాత కూడా నీనా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ప్రితీశ్‌ నంది పై నటి నీనా గుప్తా కామెంట్స్ చేస్తూ.. ప్రీతిష్ నంది తన పరిధి దాటి మసాబా జనన ధృవీకరణ పత్రాన్ని దొంగిలించాడనీ, ఆమె గుర్తింపును బహిరంగపరిచాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను అనుకోవడం లేదు.అతను నాకు ఏమి చేసాడో నీకు తెలుసు, నేను అతన్ని బహిరంగంగా బాస్టర్డ్ అని పిలిచాను. అతను నా కూతురి జనన ధృవీకరణ పత్రాన్ని దొంగిలించి ప్రచురించాడు' అని కామెంట్‌ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్‌ను నీనా తన ట్వీట్ ను డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. నీనా గుప్తా ఆ కాలంలో ప్రసిద్ధ జర్నలిస్ట్ అయిన ప్రీతిష్ నంది మసాబా జనన ధృవీకరణ పత్రాన్ని దొంగిలించడానికి ఎలా కుట్ర పన్నాడో వెల్లడించారు. ఆ సంఘటనపై నీనా బహిరంగంగా మాట్లాడింది. ప్రీతిష్ నందిని తన చర్యలకు తప్పుబట్టారు నటి నీనా గుప్తా. ఆయన జర్నలిస్ట్ అనే విషయం దాచిపెట్టాడని, తనను తాను కుటుంబ బంధువుగా పరిచయం చేసుకున్నాడని, ఆసుపత్రి రిజిస్ట్రార్ నుండి మసాబా జనన ధృవీకరణ పత్రాన్ని దొంగతనం చేశాడని ఆరోపించింది. దీని ఆధారంగా నీనా- క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్‌ అయ్యారనే వివాదం తెరపైకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X