పెళ్ళయాక అందవిహీనంగా.. సిగ్గుండాలి అంటూ రెచ్చిపోయిన సమీరా రెడ్డి!
నెటిజన్ తన అందం గురించి చేసిన కామెంట్ కు సమీరా రెడ్డి రెచ్చిపోయి సమాధానం ఇచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సమీరా రెడ్డి పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సమీరా రెడ్డి 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. సమీరా, అక్షయ్ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం సమీరారెడ్డి గర్భవతి. రెండో బిడ్డకు తల్లి కాబోతోంది.

లావైపోయింది
ఇటీవల కరీనా కపూర్ తన కొడుకుతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమీరారెడ్డి మునుపటిలా నాజూగ్గా లేదు. పెళ్లయ్యాక లావుగా, అందవిహీనంగా తయారైంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ కు సమీరారెడ్డి అంతే ధీటుగా సమాధానం ఇచ్చింది. కొంతమంది లావు అయ్యాక సన్నబడడానికి బాగా సమయం పడుతుందని సమీరా రెడ్డి తెలిపింది.

కరీనా కపూర్‌లా ఉండలేరు
తాను బరువు పెరగడంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ .. అందరూ కరీనా కపూర్‌లా ఉండలేరు అని తెలిపింది. కొంతమంది పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టాకా లావుగా మారుతారు. కొంతమంది కరీనా కపూర్‌లా నాజూగ్గానే ఉంటారు. అలాగని అందరూ కరీనా కపూర్ కాలేరు. బరువు తగ్గాలంటే కాస్త సమయం పడుతుంది. మహిళల శరీరాకృతి గురించి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు అంటూ సమీరా రెడ్డి ఘాటుగా స్పందించింది.

మీ అమ్మ కూడా
నా శరీరం గురించి కామెంట్ చేసే వారిని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాయి. మీరు పుట్టాకా మీ అమ్మ అందగానే ఉన్నారా అని ప్రశ్నించింది. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గు పడండి. ప్రతి మహిళ తల్లి కావాలని భావిస్తుంది. నాకు కొడుకు పుట్టాక బరువు తగ్గడానికి సమయం పట్టింది. ఇప్పుడు మళ్ళీ తల్లిని కాబోతున్నా. మన శరీరం ఎలా ఉన్నా దానిని స్వీకరించగలిగే స్వభావం ఉండాలని సమీరా రెడ్డి తెలిపింది.

స్టార్ హీరోల సరసన
సమీరా రెడ్డి తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. నరసింహుడు, అశోక్ చిత్రంల్లో ఎన్టీఆర్ సరసన, జైచిరంజీవలో చిరంజీవికి జోడీగా నటించింది. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. చాలా మంది సీనియర్ హీరోయిన్లు వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. సమీరా రెడ్డి రెండవసారి తల్లి కాబోతోంది కాబట్టి ఆమె రీ ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications











