twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారత్‌కు వ్యతిరేకంగా బాలీవుడ్( పాకిస్థానీ) హీరోయిన్ల కామెంట్!

    |

    పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్‌ గగనతలంలోకి ధైర్యంగా ప్రవేశించి జైషే మహ్మద్ ఉగ్రశిబిరాలపై మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత్ ప్రతీకార దాడి తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సరిహద్దులో యుద్ధవాతావరణం కనిపిస్తోంది.

    రెండు దేశాల మధ్య యుద్దం వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో... షారుక్ ఖాన్ బాలీవుడ్ మూవీ 'రయీస్'లో నటించిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ స్పందించారు. ఉగ్రవాదులను భారత్ మీదకు పంపి దాడులు చేయిస్తున్న తన దేశం కుట్రల గురించి మాట్లాడకుండా... నీతి వ్యాఖ్యాలు వళ్లించింది.

    పాకిస్థాన్ జిందాబాద్ అంటూ..

    పాకిస్థాన్ జిందాబాద్ అంటూ..

    యుద్ధం కోరుకోవడం అమాయకత్వం, యుద్ధాన్ని కోరుకోవడం కంటే చెడ్డపని ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కాస్త ఆలోచించాలి... పాకిస్థాన్ జిందాబాద్' అంటూ మహీరా ఖాన్ ట్వీట్ చేశారు.

    మనపై ఉగ్రదాడి జరిగినపుడు వీరంతా ఏమైనట్లు?

    మనపై ఉగ్రదాడి జరిగినపుడు వీరంతా ఏమైనట్లు?

    ఇండియన్స్ యుద్దం కోరుకుంటున్నారనే అర్థం వచ్చేలా మహిరా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు మండి పడుతున్నారు. భారత జవాన్లపై ఉగ్రదాడి చేసింది మీరు, ఇండియా మీదకు ఉగ్రవాదులను ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తుంది మీరు... మీరేదో శాంతికాముకులైనట్లు నీతులు చెప్పడం ఆపాలంటూ ఫైర్ అవుతున్నారు.

    మావ్రా హోకేన్

    మావ్రా హోకేన్

    ‘సనమ్ తేరి కసమ్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మరో పాకిస్థాన్ నటి మావ్రా హోకేన్ స్పందిస్తూ... ‘భారత మీడియా బాధ్యతగా ప్రవర్తించడం మానేసి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోందని, మీడియా ముందు తన తీరు మార్చుకోవాలి. అంతా శాంతి కోరుకుందాం' అంటూ ట్వీట్ చేసింది.

    వీణా మాలిక్

    వీణా మాలిక్

    పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన పాకిస్థాన్ నటి వీణా మాలిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతీకార దాడిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘మై నేమ్ ఈజ్ ట్రీ.. నేను టెర్రరిస్టును కాదు' అంటూ ట్వీట్ చేశారు.

    బాలీవుడ్లో సంపాదించి.. భారత్‌కు వ్యతిరేకంగా

    బాలీవుడ్లో సంపాదించి.. భారత్‌కు వ్యతిరేకంగా

    డబ్బు సంపాదన కోసం ఇండియా వచ్చిన ఈ పాకిస్థానీ హీరోయిన్లను భారతీయులు విశాల హృదయంతో ఆదరించారు. పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినపుడు కిక్కురుమనని వీరంతా... ఇపుడు భారత్ ప్రతీకార చర్యకు దిగగానే నీతి వ్యాఖ్యాలు వళ్లిస్తున్నారు.

    English summary
    "Nothing uglier. Nothing more ignorant than cheering for war. May sense prevail... Pakistan zindabad," Mahira Khan, who starred in Bollywood film Raees, on Surgical Strike 2 by India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X