లైంగికంగా వేధించాడు, ఆ దర్శకుడితో సినిమా చేయడంపై దీపిక పదుకోన్‌పై విమర్శలు!
సోషల్ మీడియాలో #NotMyDeepika అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల దీపిక పదుకోన్, రణబీర్ కపూర్ కలిసి ఫిల్మ్ మేకర్ లవ్ రాజన్ ఆఫీసు వద్ద కనిపించినప్పటి నుంచి ఈ యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో తెగ సర్వ్యూలేట్ అవుతోంది. ఈ ఇద్దరు స్టార్లు లవ్ రాజన్ దర్వకత్వంలో సినిమా సైన్ చేయబోతున్నట్లు వార్తలు రావడంతో.... నువ్వు మా దీపిక కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 2018లో లవ్ రాజన్ ఓ నటిని సెక్సువల్ హరాస్మెంట్ చేశాడనే ఆరోపణలు రావడంతో అతడితో సినిమా చేస్తున్న దీపిక పట్ల నెటిజన్లు ఆగ్రహంగా ఉన్నారు.

దీపిక మీద అంసతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
ఓ ట్విట్టర్ యూజర్ దీనిపై స్పందిస్తూ... ‘మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి అభిమానిస్తున్నాను. అతడితో సినిమా చేసి మీరు ఇంతకాలం సంపాదించుకున్న పేరును చెడగొట్టుకోవద్దు. అతడితో కలిసి సినిమా చేయడం అనే ఆలోచన విరమించుకుంటారని అనుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు.

అలా చేస్తే మీపై గౌరవంపోతుంది
లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులతో కలిసి పని చేయడం ద్వారా మీపై కూడా నెగెటివ్ ప్రభావం పడుతుంది. మీపై ఇంతకాలం ఉన్న గౌరవం పోతుంది. అతడితో కలిసి ఎట్టపరిస్తితుల్లోనూ సినిమా చేయకూడదు, ఒక వేళ చేస్తే అలాంటి నీచమైన పనులు చేసే వారికి మద్దతు ఇచ్చినట్లు అవుతుంది... అని అభిప్రాయ పడుతున్నారు.

లవ్ రాజన్ మీద ఉన్న ఆరోపణలు ఇవే..
2010లో ప్యార్ కా పంచనామా సినిమా ఆడిషన్స్ జరిగిన సందర్భంగా లవ్ రాజన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు మీటూ ఉద్యమంలో భాగంగా ఓ నటి అక్టోబర్ 2018లో ఆరోపణలు చేశారు. తొలుత ఈ ఆరోపణలను లవ్ రాజన్ ఖండించాడు. తన ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి అంటూ తర్వాత మరో ప్రకటన చేశారు.

దీపిక పదుకోన్
దీపిక పదుకోన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ‘చపాక్' అనే చిత్రం చేస్తోంది. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌గా కనిపించబోతున్నారు. దీంతో పాటు తన భర్త రణవీర్‌సింగ్‌తో కలిసి ‘83' చిత్రం చేస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో, దీపిక అతడి భార్య పాత్రలో కనిపించనుంది.


Click it and Unblock the Notifications











