రెమ్యూనరేషన్ భారీగా పెంచిన హీరో ... ఒక్కో సినిమాకు రూ. 54 కోట్లు
బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు నమోదు చేస్తున్న స్టార్ అక్షయ్ కుమార్. వరుస విజయాల ఎఫెక్టుతో ఈ హీరో భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడట. తాజాగా ఆయన తన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 54 కోట్లుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
2012లో అక్షయ్ కుమార్ 'రౌడీ రాథోర్' సినిమా చేసే సయమంలోనే రూ. 27 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ రెమ్యూనరేషన్ భారీ మొత్తం పెరిగింది. అయితే అక్షయ్ కుమార్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధంగానే ఉంటున్నారట. ఆయన సినిమాలకు ఉన్న మార్కెట్ విలువే అందుకు కారణం.

కేవలం సినిమాలు మాత్రమే కాదు... బ్రాండ్ ఎండార్స్‌మెుంట్ల ద్వారా కూడా అక్షయ్ కుమార్ భారీగా సంపాదిస్తున్నారు. 2019లో ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో ఇండియా నుంచి అక్షయ్ కుమార్ (రూ. 444 కోట్లు) చోటు దక్కించుకున్నాడు.
అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... 'మిషన్ మంగళ్' ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇస్రో చేపట్టిన మంగళయాన్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దీంతో పాటు హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్, సూర్యవంశీ, బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











