సమంత లాంటి దేవతలను అభినందిస్తాం: కంగన రనౌత్ సోదరి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోళి చందల్ పేరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. కంగనా వ్యతిరేకులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉండటమే ఇందుకు కారణం. అందరితో గొడవలు పడే లేడీగా పేరున్న రంగోళి... తాజాగా సమంత 'ఓ బేబీ' మూవీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
''ఓ బేబీ చిత్రం అద్భుతమైన విజయం అందుకుంది. సమంత అసలు సిసలైన స్తీవాది, ఆమె సక్సెస్ స్టోరీ చాలా గొప్పగా ఉంటుంది. ఒక పెద్ద సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి అయుండి కూడా సొంతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మేము అలాంటి దేవతలను అభినందిస్తాము. కంగనా టీమ్ నుంచి ఆమెకు ఆల్ ది బెస్ట్.'' అంటూ రంగోళి ట్వీట్ చేశారు.

'ఓ బేబీ' సినిమా విషయానికొస్తే... శుక్రవారం(జులై 5) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బాబు, సునీత తాటి, టిజి విశ్వప్రసాద్, హ్యూనవూ థామస్ కిమ్ నిర్మాతలు.
'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో అలరింంచింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.
ఈ చిత్రంలో సమంత, లక్ష్మి, నాగ శౌర్య, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్, తేజ సజ్జ, ప్రగతి, స్నిగ్ద, ఐవ్వర్య, ఊర్వశి, ప్రియదర్శి, ధనరాజ్, అడవి శేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.


Click it and Unblock the Notifications











