స్టార్ హీరోతో హాట్ బ్యూటీ.. భార్యలాగే అన్ని పనులు.. ముహూర్తం దగ్గరపడిందా!
కండల వీరుడి సల్మాన్ ఖాన్ ఇంకా ఎన్నిరోజులు బ్రహ్మచారిగా ఉంటాడో అర్థం కానీ పరిస్థితి. పెళ్లి మాటెత్తితే ఏదో ఒక సాకు చెప్పి, లేదా ఒక జోక్ వేసి టాపిక్ మార్చేస్తుంటారు. గత 20 ఏళ్లుగా సల్మాన్ ఖాన్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అలాగని సల్లూభాయ్ ఆడవాళ్లకు దూరంగా ఉండే రకం కాదు. సల్మాన్ ప్రేమ వ్యవహారాలు, టాప్ హీరోయిన్లతో రొమాన్స్ బాలీవుడ్ మొత్తం తెలుసు. ఐదు పదుల వయసు దాటినా సల్మాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే. ఇదిలా ఉండగా రొమేనియన్ సుందరి లూలియా వంటూర్, సల్మాన్ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ బర్త్ డే
డిసెంబర్ 27న కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖులకు బర్త్ డే బాష్ ఏర్పాటు చేసి పసందైన విందు ఇచ్చాడు. ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, జాక్వలిన్ ఫెర్నాండేజ్, అనిల్ కపూర్, కృతి సనన్ లాంటి సెలెబ్రిటీలంతా సల్మాన్ బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యారట.

భార్య భర్తల్లాగే
సల్మాన్ ఖాన్, లులియా ప్రేమలో ఉన్నారనే విషయం పెద్ద సీక్రెట్ ఏమి కాదు. పార్టీలో వీరిద్దరూ జంటగా కనిపించారని బాలీవడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగింది. సల్మాన్ భార్యలాగే లులియా మెలిగిందట. సల్మాన్ తో కలసి ఏర్పాటలన్నీ పరిశీలించడం, గెస్ట్ లని రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే పెళ్లి కాకుండానే సల్మాన్ కు ఆమె భార్య ఐపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాస్ట్లీ గోల్డ్ చైన్
సల్మాన్ ఖాన్ కు బర్త్ డే గిఫ్ట్ గా లులియా కాస్ట్లీ గోల్డ్ చైన్ ని ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఏసు శిలువ ఉండే చైన్ ని లులియా గిఫ్ట్ గా ఇచ్చిందట. లులియాని పార్టీలో చూసినవారంతా సల్మాన్ సొంత ఇంటి మనిషిలానే మెలిగిందని చర్చించుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు గతంలో పలు సందర్భాల్లో సల్మాన్ కుటుంబం వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్లినా లులియా అక్కడ ప్రత్యక్షమయ్యేది. సల్మాన్ ఖాన్ పెళ్లి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడా అనే ఊహాగానాలు మొదలవుతున్నాయి.

వాళ్లిద్దరూ రాకపోవడానికి కారణం
ఇక సల్మాన్ ఖాన్, అమిర్, షారుఖ్ ని బాలీవుడ్ ఖాన్ త్రయంగా పిలుస్తుంటారు. వీరు ముగ్గురి మద్య మంచి స్నేహం కూడా ఉంది. కానీ షారుఖ్, అమిర్ సల్మాన్ ఖాన్ ఇద్దరూ బర్త్ డే పార్టీకి హాజరు కాకపోవడంపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదని అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ప్రమోషన్ కోసం చైనా వెళ్ళాడు. ఇక షారుఖ్ జీరో చిత్ర ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడిపి అలసిపోయాడు. అందువలనే వీరిద్దరూ హాజరు కాలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











