Kiara Advani: ఆ యువ హీరోకు దూరంగా ఉంటున్న హీరోయిన్.. నిజంగానే బ్రేకప్?
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో మళ్ళీ వరుసగా సెలబ్రిటీల పెళ్లి వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వారు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అలియాభట్ రణ్ బీర్ కపూర్ మూడుముళ్ల బంధంతో సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక మరొక జంట కూడా అదే తరహాలో సిద్ధమవుతోంది అని వార్తలు వస్తున్న తరుణంలోనే బ్రేకప్ చెప్పినట్లుగా కొత్త టాక్ వినిపిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ ఒక హీరోతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో స్టార్ హీరోలతో
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కీయరా అద్వానీ ఒకవైపు బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. మొదట ఈ బ్యూటీ మహేష్ బాబు కొరటాల శివ కలయికలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమాపైనే..
అయితే ఆ సినిమాలు ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అయితే అందించలేదు. ఇక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాపైనే పెట్టింది. ఈ సినిమాలో కీయరా పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు సమాచారం.

లవ్ మ్యాటర్ వైరల్
సాధారణంగా దర్శకుడు శంకర్ తన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్స్ కు ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. RC15 లో పాత్ర కూడా అదే తరహాలో ఉంటుంది అని తెలుస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత ఈ బ్యూటీకి సంబంధించిన లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

యువ హీరోతో ప్రేమ?
కియారా అద్వానీ బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ మధ్యలో వీరిద్దరు కూడా ఆ రూమర్స్ పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మళ్లీ ఎప్పటిలానే డేటింగ్ లో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి.

అస్సలు తగ్గడం లేదు..
మొత్తానికి పెళ్లికి సిద్ధమైనట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ రావడంతో అందరు నిజమే అని అనుకున్నారు. అయితే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో లేను అని కాస్త ఇన్ డైరెక్ట్గానే చెబుతున్నప్పటికీ కూడా ఈ వార్తలు అస్సలు తగ్గడం లేదు. దీంతో అమ్మడు పూర్తిగా అతనికి దూరమైపోయిందని కూడా తెలుస్తోంది.

నిజంగానే విడిపోయారా?
అయితే వీరిద్దరూ ఇంకా ప్రేమలోనే ఉన్నట్లు కూడా కొన్ని వెబ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం సిద్ధార్థ్ కు సంబంధించిన అనేక రకాల కథనాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు నిజంగానే వీళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారా? లేక రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి అని దూరంగా ఉంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే వీరి కలయికలో మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే టాక్ వినిపిస్తోంది మరి ఆ సినిమా విషయంలో కియారా అద్వానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











