హృతిక్ రోషన్ వల్లే అమీర్ ఖాన్ బంధం తెగిపోయింది.. మరోసారి కంగనా షాకింగ్ పోస్ట్ వైరల్!
ఎలాంటి స్నేహం, ప్రేమ అయినా సరే మనస్పర్థలు, చెప్పుడు మాటలు వల్ల నాశనం అవుతుంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడి బంధాలు, స్నేహాలు ఉఫ్ ఉంటేనే ఊడిపోతుంటాయి. ఎంతకాలం ఎవరు, ఎవరితో కలిసుంటారో ఎప్పుడు విడిపోతారో అస్సలే చెప్పలేం. అది ప్రేమలో అయినా స్నేహంలో అయినా. అయితే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విషయంలోనూ ఇదే జరిగింది.
అమీర్ ఖాన్ తో ఆమె స్నేహం మూన్నాళ్ల ముచ్చటగానే సాగింది. వెంటనే ముగిసిపోయింది. ఇందుకు కారణం హీరో హృతిష్ రోషన్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని నేరుగా కంగనానే తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ వేధికగా ఈ విషయాన్ని వెల్లడించింది కంగనా. రెండు స్టోరీలు పెట్టిన ఈమె.. అందులో అమీర్ సార్ తో స్నేహంగా ఉన్న రోజులు అప్పుడప్పుడూ నాకు గుర్తుకు వస్తాయని చెప్పింది. ఆ రోజులు ఎక్కడికి పోయాయి అంటూ ఫీల్ అయింది.

ఒక్కటైతే తాను కచ్చితంగా చెప్పగలనంటూ వివరించింది. ఆయన తనకు దిశానిర్దేశం చేశేవారని చెప్పుకొచ్చింది. అమీర్ ఖాన్ తనను ప్రశంసించే వారని, తన సినిమాల విషయంలో కూడా చాలా సాయం చేశారని కంగనా వెల్లడించింది. హృతిక్ తన మీద లీగల్ కేసు వేయడంతో అంతా ముగిసిపోయిందని స్పష్టం చేసింది. తాను ఓ వైపు అయితే ఇండస్ట్రీ మొత్తం మరోవైపు వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అమీర్, తనకు మధ్య ఉన్న స్నేహం ముగిసి పోవడానికి హృతిక్ రోషన్ యే కారణం అంటూ పేర్కొంది.
కంగనా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 2016-17 సమయంలో కంగనా, హృతిక్ మధ్య ఒక పెద్ద లీగల్ వార్ నడిచిన విషయం అందరికీ తెలిసిందే. హృతిక్, తాను డేటింగ్ చేస్తున్నట్లు ఆమె మీడియా ముందు చెప్పగా.. హృతిక్ చాలా సార్లు ఈ విషయాన్ని ఖండించాడు.
చివరకు 2020లో హృతిక్ రోషన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసు సైబర్ సెల్ నుంచి క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చేంజ్ అయినప్పుడు హృతిక్ మూవ్ ఆన్ అని కంగనా ట్వీట్ చేసింది. కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయం కాబోతుంది. ఈ చిత్రంలో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











