RRR అలియా భట్ పాత్రపై మొదలైన రచ్చ.. ఇది మరీ టూ మచ్!
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల అలియా భట్ పాత్రకు సంబంధించిన లుక్ రిలీజ్ చేయడంతో ఒక వివాదం మొదలయ్యింది. నార్త్ లో కొంతమంది అభ్యంతరం చెప్పడం మరీ టూ మచ్ గా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

రామ్ చరణ్ కు జోడిగా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అలియా భట్ మొదటి సారి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఆశలు భారీగానే పెట్టుకుంది. అల్లూరి సీతారామరాజు పాత్రకు జోడిగా సీత అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, అలియా భట్ కాంబో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందట.

మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ
ఇటీవల అలియా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఇక మరికొందరైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ అభ్యంతరం చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

RRR బాయ్‌కాట్..
అసలు సినిమాలో ఆమె ఎలాంటి పాత్ర చేస్తోంది అనే అవగాహన లేకుండా సినిమాను బాయ్‌కాట్ అంటున్నారు. నార్త్ మీడియాకు చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా అదే తరహాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. సీత మాత పేరును గౌరవం లేకుండా సీత అనే కామెంట్ పెట్టడం ఏ మాత్రం సరైనది కాదని అంటున్నారు. ఎలాగైనా సినిమాను బాయ్‌కాట్ చేయాల్సిందే అంటూ ప్రచారాలు మొదలు పెట్టడం వింతగా ఉంది.

ఫ్యాన్స్ రివర్స్ ట్రోల్స్
ఇక RRR అభిమానులు మాత్రం రివర్స్ ట్రోల్స్ ఎటాక్ చేస్తున్నారు. కనీసం సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తోందనే అవగాహన లేకుండా అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డురమని అంటున్నారు. అల్లూరి సీతారామరాజు భార్యగా నటిస్తుంటే ఆమె నిజంగా రాముడి భార్య పాత్రలో నాటిస్తోందని చెప్పడంపై ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











