twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తే..: మరోసారి క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్

    |

    బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ లో కూడా అనేక రకాల నెగిటివ్ పాత్రలతో ఆకట్టుకున్న నటుడు సోనూ సూద్. వెండితెరపై ఈ నటుడు అందుకున్న క్రేజ్ కంటే కూడా నిజజీవితంలో అందుకున్న ప్రశంసలు చాలా ఎక్కువనే చెప్పాలి. పరిస్థితులను బట్టి మనిషిలోని అసలైన మంచితనం బయటకు వస్తుందనే మాటకు సోనూ చేసిన సహాయలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక ఈ నటుడు మరోసారి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

    ఒకేసారి కన్నిటితో పాటు ఆనందాన్ని చూసి..

    ఒకేసారి కన్నిటితో పాటు ఆనందాన్ని చూసి..

    లాక్ డౌన్ ఎప్పుడైతే మొదలయ్యిందో సోనూ సూద్ తీసుకున్న కీలక నిర్ణయం దేశ ప్రజలను ఎంతో అమితంగా ఆకట్టుకుంది. వలస కూలీలు సొంత గూటికి చేరుకునేందుకు నానా అవస్థలు పడుతుండగా చలించిపోయిన సోనూ సూద్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరినీ సొంత ఊళ్లకు చేర్చాడు. వారి మొహంలో ఒకేసారి కన్నిటితో పాటు ఆనందాన్ని కూడా చూశానని సహాయం చేసిన తరువాత నాకు ఎంతో సంతోషం వేసినట్లు సోనూ చెప్పాడు.

    ఎంతో మందికి మేలు చేయవచ్చని..

    ఎంతో మందికి మేలు చేయవచ్చని..

    ఇక సోనూ సూద్ చేస్తున్న సహాయాలకు అతను రాజకీయాల్లోకి వస్తే ఇంకా బావుంటుందని ఎంతో మందికి మేలు చేయవచ్చని జనాలు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని గత కొన్ని రోజుల క్రితం సోనూ సూద్ ఒక వివరణ ఇచ్చాడు. ఇక మరోసారి ఆ సందేహాలపై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

    రాజకీయాల్లోకి వస్తే..

    రాజకీయాల్లోకి వస్తే..

    సోనూ సూద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో గనక రాజకీయాల్లోకి వస్తే వంద శాతం ప్రతి ఒక్కరికి సహయం చేసే బాధ్యత బలం నాకు ఉంటుంది. ప్రజల సమస్యలను ఈజీగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి నేను ఏ మాత్రం సిద్ధంగా లేను. ఇక ఇప్పుడైతే స్వచ్ఛంగా స్వేచ్ఛగా నేను అనుకున్న పనులు చేస్తున్నాను.

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    ఏదైనా సరే తుది నిర్ణయం నాదే

    ఏదైనా సరే తుది నిర్ణయం నాదే

    ప్రజలకు సేవ చేయడంలో ప్రస్తుతం నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఏదైనా సరే తుది నిర్ణయం నాదే. ఇక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తనో లేనో ఇప్పుడే చెప్పలేను. నేను సినిమా రంగంలో ఇంకా కొంత కాలం పాటు కొనసాగాలని అనుకుంటున్నాను. లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రోడ్డుపైనే వెలుతున్నపుడు నేను ఎంతో బాధకు గురయ్యాను. వారికి సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో చూసిన ఆనందం నేను ఎప్పటికి మర్చిపోలేను అను సోనూ సూద్ వివరణ ఇచ్చారు.

    English summary
    After the corona crisis began, some unexpected facts emerge. Also a real good story is coming out. Until the lockdown, everyone knew that Sonusood was a villain on the silver screen. But what he does to help when there is a hardship comes out of the lockdown. Once again, Sonu Sood set up chartered flights at his own expense to accommodate the poor people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X