సుశాంత్ నీవు ఈ లోకం వీడి 30 రోజులు.. ఇంకా ఆ బాధలోనే మాజీ ప్రియురాళ్ల ఎమోషనల్ పోస్ట్

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన దేశాన్ని కుదిపేసింది. జూన్ 14న తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ మరణంపై భిన్న కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మేరకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్స్ రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సుశాంత్ మరణం వెనుకున్నది ఎవ్వరో ప్రపంచానికి తెలియాలని నెటిజన్స్, ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే సుశాంత్ మరణించి నేటికి 30 రోజులు అవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, అంకితా లోఖండే ఎమోషనల్ అయ్యారు.

ప్రతీ రోజూ నేర్చుకునేదాన్ని..

ప్రతీ రోజూ నేర్చుకునేదాన్ని..

సుశాంత్ సింగ్ మరణించి ముప్పై రోజులు అయిన సందర్భంగా మాజీ ప్రేయసి రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. ‘నీవు లేవనే బాధ, ఆ భావోద్వేగాలోంచి బయటపడటానికి ఇంకా కష్టపడుతున్నాను .. నా హృదయం మొత్తం మూగబోయింది. ప్రేమను, దాని శక్తిని విశ్వసించేలా చేసిన వ్యక్తివి నువ్వు. గణిత శాస్త్ర ఫార్మూలాతో జీవితార్థాన్ని నేర్పించావు. నేను ప్రతిరోజూ నీ నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. మీరు ఇకపై ఇక్కడ ఉండకపోవటంతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను.

 తిరిగి తీసుకురావాలి..

తిరిగి తీసుకురావాలి..

మీరు ఇప్పుడు ఎంతో ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నారని నాకు తెలుసు. చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు "గొప్ప భౌతిక శాస్త్రవేత్త"ని ఎంతో గొప్పగా స్వాగతం పలికి ఉంటాయి. ఎంతో గొప్ప మనసుతో, ఆనందంతో, మీరు షూటింగ్ స్టార్‌ను వెలిగించేవారు . నేను నా షూటింగ్ స్టార్ మీ కోసం ఎదురుచూస్తాను. మిమ్మల్ని నా దగ్గరకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటాను.

మాటలు సరిపోవు..

మాటలు సరిపోవు..

మీరు ఒక అందమైన వ్యక్తి, అది ప్రపంచం చూసిన గొప్ప అద్భుతం. మన మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచటానికి మాటలు సరిపోవు. అది అన్నింటికంటే గొప్పదని, మన ఇద్దరినీ మించిన ప్రేమ అదని ఒకప్పుడు మీరు చెప్పింది వాస్తవమేనని నేను అనుకుంటున్నాను.

కోల్పోయి 30 రోజులు..

కోల్పోయి 30 రోజులు..


నువ్ ప్రతిదీ ఓపెన్ హార్ట్‌తో ప్రేమిస్తావ్.. ఇప్పుడు నువ్ మన ప్రేమ ఎంతో గొప్పదని నాకు చూపించావ్. ప్రశాంతంగా ఉండు సుశి.. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది కానీ నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. అనంతం, అంతకు మించి ఎల్లప్పుడూ నీతో శాశ్వతంగా ఉండిపోతాను'అని ఎమోషనల్ అయింది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 దీపం వెలగించి..

దీపం వెలగించి..

అయితే అంకితా లోఖండే మాత్రం సింపుల్‌గా దేవుడి ముందు దీపం వెలిగింది. దేవుడి బిడ్డ అంటూ ఒకే ఒక్క కామెంట్ చేసింది. ఇంకా ఎటువంటి అనవరసరపు కామెంట్లు చేయలేదు. దీంతో అంకితా చర్యలకు పోస్ట్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సుశాంత్‌కు నిజమైన ప్రేయసి అంకితాయే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X