పిచ్చిగెంతులు...చెప్పుదెబ్బలు... వైరల్ అవుతున్న మనోహరి భామ వీడియో
నోరా ఫతేహీ... ఈ పేరు కన్నా మనోహరి పాప అంటేనే టాలీవుడ్ జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతుంది అమ్మడు. తెలుగునాట ఐటమ్ సాంగ్స్ కు ఓ స్పెషల్ క్రేజ్ తీసుకువచ్చిన నోరా ఫతేహీ, బాహుబలిలోని మనోహరి పాటలో, అద్భుతమైన వయ్యారాలతో జనాలను కట్టిపాడేసిందనే చెప్పాలి.

నటనపై నోరా గురి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకున్న నోరా, ప్రస్తుతం యాక్టింగ్ పైనా దృష్టిసారించిందనే చెప్పాలి. ఐటమ్ సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవ్వకుండా తనలోని నటిని సైతం వెలికి తీయడం మొదలుపెట్టిన ఈ భామ, త్వరలోనే భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలో కనిపించబోతోంది.

హాట్ వీడియోలతో సెగలు...
ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్న నోరా, ఇకపై నటనలోనూ రాణించేందుకు గట్టిగానే స్కెచ్ వేస్తోంది. ఇందులో భాగంగానే అమ్మడు కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఇక ఇప్పటికే అమ్మడి డాన్స్ మూవ్స్ కు ఫిదా అయిపోయిన జనం, అమ్మడి ఫన్నీ యాక్టింగ్ సింక్ట్ కు కూడా ఫ్యాన్స్ అయిపోయారు.

అమ్మ చేతిలో చెప్పుదెబ్బలు....
ఈ మధ్య WAP ఛాలెంజ్ సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన నోరా, మాంచి ఊపుమీద డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అయితే వంటింట్లోనుంచి గమనిస్తూనే నోరా తల్లి అమ్మాయి చేసే వెర్రి చేష్ఠలు భరింలేక ఆమె మీదకు చెప్పులు విసిరింద. దీంతో నోరా పలాయనం చిత్తగించింది.
Recommended Video

అంతా ఫన్ కోసమే
అయితే ఇంతకూ మ్యాటర్ ఏమిటంటే, ఇదంతా నిజం కాదు. నోరా సరదాగా చేసిన ఓ ఫన్నీ వీడియో మాత్రమే. చెప్పులు విసిరిన నోరా తల్లిగానూ నటించింది ఆమెనే. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


Click it and Unblock the Notifications











