83 movie on OTT: రణ్‌వీర్ సింగ్, దీపిక మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ ఏమిటంటే?
క్రికెట్‌లో దిగ్గజ వెస్టిండీస్ టీమ్‌ను ఎదురించి 1983లో జరిగిన వరల్డ్ కప్‌లో కపిల్ డెవిల్స్ అద్భుతమైన విజయం సాధించడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు. అండర్ డాగ్‌గా ప్రపంచకప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ టీమ్‌ను కెప్టెన్ కపిల్ దేవ్ స్పూర్తిదాయకమైన ఇన్నింగ్స్‌ను ఆడటమే కాకుండా జట్టును విజయపథాన నడిపించాడు. అలాంటి మధురానుభూతులను 83 మూవీగా బాలీవుడ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. అయితే ఈ సినిమాకు కోవిడ్ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలో 83 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు కబీర్ ఖాన్ వివరణ ఇస్తూ..

కపిల్ దేవ్ జీవితంలో కీలక సంఘటనలు
83 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంగా కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా 83 మూవీని తెరకెక్కించాం. అయితే సినిమా పూర్తి అయిన తర్వాత రిలీజ్ చేయడానికి దాదాపు 18 నెలలు వేచి చూశాం. చివరకు డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ చేశాం అని కబీర్ ఖాన్ చెప్పారు.

బాక్సాఫీస్ వద్ద పేలవంగా
అయితే 83 మూవీపై సినీ విమర్శకుల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. ఈ సినిమాపై అద్బుతమైన రివ్యూలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ కలెక్షన్లు మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేశాయి. అందుకు కారణం పలు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు సినిమాకు ప్రతికూలంగా మారాయి. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేశారు. దాంతో వసూళ్ల పరంగా వెనుకపడ్డాం అని చిత్ర యూనిట్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

స్పైడర్ మ్యాన్, పుష్ప నుంచి పోటీ
ఉత్తరాది, రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు, ఇతర చిత్రాల నుంచి 83 సినిమాకు భారీ పోటీ ఏర్పడింది. దక్షిణాదిలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, స్పైడర్ మ్యాన్ లాంటి చిత్రాల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దాంతో ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేయలేకపోయింది అనే భావన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది.

100 కోట్లకు చేరువగా
83 మూవీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రెండోవారంలో శుక్రవారం రోజున ఈ చిత్రం 4.36 కోట్లు రాబట్టింది. శనివారం భారీగా వసూళ్లు పెరగడంతో 7.73 కోట్లు కలెక్షన్లు, అలాగే ఆదివారం 7.31 కోట్లు నమోదయ్యాయి. దాంతో ఈ చిత్రం 91.27 వసూలు చేసి 100 కోట్లకు చేరువైంది.
Recommended Video

త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌కు ప్లాన్
అయితే కరోనావైరస్ కేసులు భారీగా పెరగడంతో థియేటర్లలలో 83 మూవీకి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో కబీర్ ఖాన్ స్పందిస్తూ. మరో నాలుగైదు రోజులు వేచి చూస్తాం. ఎప్పుడు ఏమి జరుగుతందో చెప్పని పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు కొనసాగితే.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తాం. అయితే పరిస్థితులు అదుపులో ఉంటే ప్రేక్షకులు సురక్షిత ప్రమాణాలు పాటిస్తూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి అని కబీర్ ఖాన్ సూచించారు.


Click it and Unblock the Notifications











