నాతో పెట్టుకొంటే.. ఆమెతో ఆటాడుకొంటా.. కంగనకు సీనియర్ డైరెక్టర్ వార్నింగ్
బాలీవుడ్ నటి కంగన రనౌత్, సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ మధ్య మాటల యుద్ద జోరందుకొన్నది. కంగన తనపై చేసిన వ్యాఖ్యలపై నిహలానీ భగ్గుమన్నారు. ఓ చిత్రం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గతంలో కంగన రనౌత్‌కు పహ్లాజ్ నిహలానీ ఓ రోల్‌ను ఆఫర్ చేశారు. అయితే ఆ సినిమా ఫోటోషూట్ సందర్భంగా తలెత్తిన ఘర్షణ వారి మధ్య వివాదంగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఐ లవ్ యూ బాస్ సినిమా వివాదం
పహ్లాజ్ నిహలానీతో జరిగిన గొడవ గురించి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఐ లవ్ యూ బాస్ అనే సినిమా ఫోటోషూట్ కోసం దారుణమైన డ్రెసెస్ ఇచ్చారు. లోదుస్తులు లేకుండానే డ్రస్ ఇచ్చారు. దాంతో ఆ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఆ సినిమాకు గుడ్ బై చెప్పాను అని కంగన వెల్లడించింది.

కంగన కాంట్రాక్టును తుంగలో తొక్కింది
కంగన వ్యాఖ్యలపై దర్శకుడు పహ్లాజ్ నిహలానీ సినిమా మాట్లాడుతూ.. ఐ లవ్ యూ బాస్ సినిమా ఫొటోషూట్ కోసం కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టాను. మూడు పాటలు కూడా షూట్ చేశాం. నా ఫొటోషూట్‌లో కనిపించడం మూలానే కంగనకు మహేష్ భట్ గ్యాంగ్‌స్టర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. మాతో మూడు సినిమాలు చేయాలనే అగ్రిమెంట్‌ను కంగన తుంగలో తొక్కింది అని మండిపడ్డారు.

ఇక నాతో పెట్టుకోవద్దు
నా సినిమాలో నటించకుండా కంగన నాపై కామెంట్లు చేయడం సరికాదు. ఆమె నాతో ఆడుకోవాలని చూస్తే తగిన బుద్ది చెబుతాను. ఆమెతో ఆడుకోవాలంటే నా వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయి. నాతో పెట్టుకోవడం సరికాదు అని కంగనకు పహ్లాజ్ నిహలానీ వార్నింగ్ ఇచ్చారు.

నేను తీసేది బూతు సినిమానా?
నేను రూపొందించ దలిచిన సినిమా బూతు సినిమా కాదు. ఆ సినిమాలో అమితాబ్‌ను నటించాలని కథ కూడా చెప్పాను. చీనీ కమ్ సినిమా మాదిరిగా ఉండే కథ కావడంతో ఆయన నటించడానికి ముందుకు రాలేదు. నేను పోర్న్ సినిమా తీస్తున్నట్టు కంగన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు అని నిహలానీ అన్నారు.


Click it and Unblock the Notifications











