శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌పై టీవీ యాంకర్ నోటిదురుసు.. లైవ్‌లో అనుచితంగా.. చివరకు ఫలితం అలా
టెలివిజన్ లైవ్ షోల సందర్భంగా యాంకర్లు, హోస్ట్‌లు ఏదో తమకు నచ్చిన విధంగా మాట్లాడుతూ పోతుంటారు. కొన్నిసార్లు నియంత్రించుకోకపోతే పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంటుంది. యాంకర్లను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ఓ యాంకర్ అమీర్ లియాఖత్ హుస్సేన్‌కు ఎదురైంది. బాలీవుడ్ తారలు శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఇంతకు ఏం జరిగిందంటే...

పాకిస్థాన్ యాంకర్ నటుడు అద్నాన్ సిద్ధిఖీతో
పాకిస్థాన్ టెలివిజన్ ఛానెల్‌లో జీవీ పాకిస్థాన్ అనే షో ప్రసారమైంది. లైవ్ కార్యక్రమానికి నటుడు అద్నాన్ సిద్ధిఖీ హాజరయ్యారు. ఆయనతో ప్రశ్నోత్తరాల సందర్భంగా యాంకర్ అమీర్ లియాఖత్ హుస్సేన్ తన నోటి దురుసును బయటపెట్టారు. దివంగత శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌పై జోకులు వేస్తూ టెలివిజన్ చర్చను దిగజార్చే ప్రయత్నం చేశారు.

శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌తో నటించి..
యాంకర్ అమీర్ లియాఖత్ హుస్సేన్ తన లైవ్ కార్యక్రమంలో అద్నాన్ సిద్దిఖీతో అడ్డదిడ్డంగా మాట్లాడారు. మామ్ చిత్రంలో నీవు శ్రీదేవితో నటించావు. ఆమె మరణించారు. ఆ తర్వాత నీవు ఇర్ఫాన్ ఖాన్‌తో ఏ మైటీ హార్ట్ అనే ఆంగ్ల చిత్రంలో నటించావు. ఆయన చనిపోయారు అంటూ అసందర్భపు జోకులు పేల్చారు. దాంతో అద్నాన్ లైవ్‌లో ఇబ్బందికి గురయ్యారు.

బిపాస, రాణిముఖర్జిని బతికించావు
అంతేకాకుండా మర్దానీ 2లో రాణి ముఖర్జితో నటించే అవకాశం వచ్చింది. కానీ నీవు ఆ సినిమాను వదులుకొని ఆమెను బతికించావు. అలాగే జిస్మ్ 2 సినిమాలో బిపాస బసుతో నటించే అవకాశం వదులుకొని ఆమె ప్రాణాలు కాపాడావు అంటూ అసందర్భపు వ్యాఖ్యలు చేశారు. యాంకర్ అమీర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో తప్పును తెలుసుకొన్న యాంకర్ అమీర్ క్షమాపణలు తెలిపారు.

తన వ్యాఖ్యలపై క్షమాపణ
శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ యాంకర్ అమీర్ లియాఖత్ బహిరంగ క్షమాపణ చెప్పారు. లైవ్‌లో కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి పదాలు మాట్లాడేస్తుంటాం. లైవ్‌లో మాట్లాడేటప్పుడు వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం కాదు. బయటకు వచ్చిన తర్వాత వాటి తీవ్రత తెలుస్తుంది. శ్రీదేవి, ఇర్ఫాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు. నా తప్పుకు క్షమాపణ కోరుతున్నాను అని యాంకర్ అమీర్ వీడియోను రిలీజ్ చేశారు.
Recommended Video

శ్రీదేవి, ఇర్ఫాన్ మరణాల గురించి
అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో 2018లో ప్రమాద వశాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఆమె ఆకస్మిక మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఇక ప్రతిభావంతుడైన ఇర్ఫాన్ ఖాన్ కొద్దిరోజుల క్రితం ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన కన్నుమూయడం ప్రపంచ సినీ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.


Click it and Unblock the Notifications











