పాకిస్థాన్ జెండా ఎగిరేసిన సల్మాన్ ఖాన్.. కండల వీరుడిపై కేసు..
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో ఇరుక్కొన్నాడు. పలు కేసుల్లో నుంచి విముక్తుడై ఊరట పొందుతున్న సల్మాన్‌పై కేసు నమోదైంది. పాకిస్థాన్ జెండా ఎగురవేశాడనే ఆరోపణలపై ఫిర్యాదు చేయడంతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. వివరాల్లోకి వెళితే..

భారత్ మూవీ షూటింగ్ కోసం
సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. ఈ చిత్ర షూటింగ్‌ను ఇండో, పాక్ బోర్డర్‌లో చేయాలనుకొన్నారు. భద్రతాపరమైన కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌కు అనుమతి లభించలేదు. దాంతో ఈ సినిమా షూట్‌ను పంజాబ్‌లోని ఓ గ్రామంలో షూట్ చేశారు.

పంజాబ్‌లో భారీ సెట్
పంజాబ్‌లోని ఓ గ్రామంలో జరిగిన షూటింగ్ కోసం భారీ సెట్‌ను వేశారు. షూటింగ్ సజావుగా సాగడంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ కథలో భాగంగా పాకిస్థాన్ జెండాను ఎగురవేయడంతో కష్టాలు మొదలయ్యాయి. పాక్ జెండా ఎగురవేయడంతో గ్రామస్థుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. దాంతో ఆ గ్రామస్థులు సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు.

పాకిస్థాన్ జెండా ఎగురవేత
పాకిస్థాన్ జెండా ఎగురవేయడంతో గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకు కారణమైన సల్మాన్‌పై కేసు నమోదు చేశారు. కోపగించిన గ్రామస్థులు సెట్‌ను, సల్మాన్ ఉంటున్న హోటల్‌ను చుట్టుముట్టి నిరసన తెలిపారు. షూటింగ్‌లో భాగమైందని చెప్పినప్పటికీ స్థానికులు ఊరుకోలేదు అని మీడియా పేర్కొన్నారు.

షూటింగ్ క్యాన్సిల్.. ముంబైకి
గ్రామస్థుల నిరసన పెరిగిపోవడం, స్థానిక ఉద్రిక్తత నెలకొనడంతో భారత్ షూటింగ్‌ను రద్దు చేశారు. అక్కడి నుంచి సల్మాన్‌తోపాటు చిత్ర యూనిట్ ముంబైకి వెళ్లిపోయింది. అయినా స్థానికంగా ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నట్టు సమాచారం.

వివాదాలతో సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఇటీవల నవరాత్రి సినిమా టైటిల్ విషయంలో హిందువుల ఆగ్రహానికి కండలవీరుడు గురయ్యాడు. కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ సినిమా పేరును లవ్ యాత్రి అని మార్చారు. తన బావ హీరోగా లవ్ యాత్రి సినిమాను సల్మాన్ నిర్మించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











