twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కశ్మీర్ ఇష్యూ.... పాకిస్థానీలకు సింగర్ అద్నన్ సమీ దిమ్మదిరిగే రిప్లై!

    |

    బాలీవుడ్ సింగర్ అద్నన్ సమీ స్వాతంత్ర్య దినోత్సవం రోజే తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. పాకిస్థాన్లో జన్మించిన అద్నన్ సమీ కొన్నేళ్లుగా ఇండియాలోనే ఉంటున్నారు. 2016లో ఆయనకు భారత పౌరసత్వం లభించింది.

    ఓ ట్రోలర్ అద్నన్ సమీని 'మీ నాన్న ఎక్కడ పుట్టారు? ఎక్కడ మరణించారు? అంటూ ప్రశ్నించారు. దీనికి సింగర్ రిప్లై ఇస్తూ... 'మా నాన్న 1942లో ఇండియాలో పుట్టారు, 2009లో ఇండియాలో మరణించారు' అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ట్రోలర్స్ ఆంతటితో తమ దాడి ఆపలేదు. కశ్మీర్ ఇష్యూ తెరపైకి తెచ్చి ఆర్టికల్ 370 విషయంలో అతడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు.

    మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటూ సమీ రిప్లై

    మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అంటూ సమీ రిప్లై

    మరో పాకిస్థాన్ యూజర్ రియాక్ట్ అవుతూ... ‘అద్నాన్ సమీ నీకు నిజంగా దమ్ముంటే కశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడి.. అపుడు చూడు నీ ఇండియా ఏం చేస్తుందో నీకు తెలుస్తుంది' అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి అద్నన్ సమీ రియాక్ట్ అవుతూ ‘తప్పకుండా... కశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగం. మీకు చెందని దాని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

    మీరు పంపలేదు.. నేనే ఆ దేశం నుంచి వచ్చేశా

    మీరు పంపలేదు.. నేనే ఆ దేశం నుంచి వచ్చేశా

    ‘నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే మేము నిన్ను వదిలించుకున్నాం' అంటూ మరొక పాకిస్థానీ కామెంట్ పెట్టగా... ‘మీరు వదిలించుకోలేదు... నాకు నేనుగా బయటకు వచ్చాను' అంటూ అద్నన్ సమీ రిప్లై ఇచ్చారు. తనపై ట్రోలింగ్ చేసిన వారికి అద్నన్ సమీ తనదైన శైలిలో రిప్లై ఇస్తూ వచ్చారు.

    సుష్మా స్వరాజ్ మరణంపై

    సుష్మా స్వరాజ్ మరణంపై

    ఇటీవల మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాఠాన్మరణంపై అద్నన్ సమీ ఎమోషనల్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఆమె మరణం తనను, తన ఫ్యామిలీని ఎంతో బాధించింది. మన అందరికీ ఆమె తల్లిలాంటి వ్యక్తి, సుష్మాజీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ ట్వీట్ చేశారు.

    గతంలోనూ అద్నన్ సమీని టార్గెట్ చేస్తూ...

    గతంలోనూ అద్నన్ సమీని టార్గెట్ చేస్తూ...

    పాకిస్థాన్లో పుట్టి, సింగర్‌గా ఎదిగిన అద్నన్ సమీ బాలీవుడ్ చిత్రాలకు పాడుతూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పాకిస్థాన్లో ఉండటం ఇష్టం లేక భారత్ వచ్చేశారు. భారత పౌరసత్వం తీసుకుని ఇండియాకు జై కొట్టారు. అప్పటి నుంచి ఆయనపై తరచూ పాకిస్థాన్ నెటిజన్లు దాడి చేస్తూనే ఉన్నారు.

    English summary
    Pakistanis start trolling on Singer Adnan Sami. They tweeted about the Kashmir issue. Adnan responded by giving them an appropriate reply. Another user asked him: “Adnan sami if you have guts just message on kashmir issue then see tera yeh India tera kia haal karta hai...” Undeterred, Adnan wrote back: “Sure...Kashmir is an integral part of India. Don’t poke your nose in things that do NOT belong to you!”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X