ఊహించని షాక్ ఇచ్చిన వివాదాస్పద హీరోయిన్.. ప్రియుడితో రహస్యంగా నిశ్చితార్థం!

Recommended Video

Is Actress Mahira Khan Engaged To Boyfriend Salim Karim? || Filmibeat Telugu

పాకిస్థానీ నటి మహీరా ఖాన్ బుల్లి తెర షోలు, బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహీరా అందానికి యువతలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ పాకిస్థానీ భామ మత్తెక్కించే చూపులతో మాయ చేసింది. రాయీస్, యాక్టర్ ఇన్ లా లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని చిత్రాలలో మహీరా నటిస్తోంది. మహీరా ఖాన్ తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మహీరా ఖాన్ గురించి సంచలన వార్త ప్రచారం జరుగుతోంది.

 ప్రియుడితో నిశ్చితార్థం

ప్రియుడితో నిశ్చితార్థం

మహీరా ఖాన్ గత కొంత కాలంగా సలీమ్ కరీమ్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. చాలా రోజులుగా వీరిద్దరూ వివాహానికి సిద్ధం అవుతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా సలీమ్, మహీరా ఖాన్ నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. టర్కీలో వీరిద్దరూ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే రహస్యంగా ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని మహీరా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

రెండో వివాహానికి రెడీ

రెండో వివాహానికి రెడీ

తాజాగా జరిగిన ఎంగేజ్మెంట్ తో మహీరా ఖాన్ రెండో వివాహానికి సిద్ధం అయింది. మహీరా ఖాన్ కు 2007లోనే హఫీజ్ ఖాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఏడేళ్ల వివాహబంధం తర్వాత వీరిద్దరూ విభేదాల కారణంగా 2014లో విడిపోయారు. ప్రస్తుతం మహీరా తన ప్రియుడు సలీమ్ ని వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.

సిగరెట్ వివాదం

సిగరెట్ వివాదం

గత ఏడాది మహీరా ఖాన్ బాలీవుడ్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. న్యూయార్క్ లో రణబీర్ కపూర్ తో కలసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇది పెద్ద వివాదం కావడంతో మహీరా ఖాన్ తనని తానూ సమర్ధించుకుంది. తాను వ్యక్తిగతంగా చేసిన పనికి ఇంతలా ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. చెడు అయినా మంచి అయినా కొన్ని వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా చర్చించకూడదు అని మహీరా తెలిపింది.

డేటింగ్ చేశారంటూ

డేటింగ్ చేశారంటూ

సిగరెట్ వివాదం మాత్రమే కాదు.. రణబీర్, మహీరా కొంత కాలం డేటింగ్ చేసినట్లు కూడా బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది. సిగరెట్ వివాదంలో రణబీర్ కపూర్ ఆమెకు బాసటగా నిలిచాడు కూడా. మహీరా ఖాన్ నటిగా ఎంతో సాధించింది. ఆ విషయాలని పక్కన పెట్టి కేవలం ఒక్క సంఘటనతో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్రోలింగ్ చేయడం తగదు అని రణబీర్ అప్పట్లో స్పందించాడు. మహీరా ఖాన్ పలు బుల్లితెర కార్యక్రమాల్లో రాణించింది. రాయిస్, వెర్నా లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X