వైరల్ పిక్స్: నటి ప్రైవేట్ ఫోటోలు లీక్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!
ప్రముఖ పాకిస్తానీ నటి సబా కమర్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. నెటిజన్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు ముస్లిం వేనా అంటూ నిలదీస్తున్నారు. ఈ స్థాయిలో సబా కమర్ నెటిజన్లకు టార్గెట్ గా మారడానికి కారణం ఉంది. సబా కమర్ కు సంబందించిన ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. టెలివిజన్ నటిగా, వెండితెరపై కూడా సబా కమర్ నటిస్తోంది. హిందీ మీయడం చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అయింది.

సిగరేట్ కాల్చుతూ
సబా కమర్ ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడానికి కారణం ఆమె సిగరెట్ కాల్చుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో నెటిజన్లు సబా కమర్ ని దుమ్మెత్తి పోస్తున్నారు.

నువ్వు కూడా ఆమె లాగే
అసలు నువ్వు ముస్లింవేనా.. నువ్వు కూడా మహీరా ఖాన్ లా తయారవుతున్నావు. సిగరెట్ కాల్చడమే కాక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా అంటూ సబా కమర్ పై విరుచుకుపడుతున్నారు.

సన్నిహితుల వివరణ
దీనిపై సబా కమర్ సన్నిహితులు వివరణ ఇచ్చారు. ఆమె ఓ యాడ్ షూట్ లో పాల్గొంది. అందులో సిగరెట్ పట్టుకుని నటించాలి. విరామ సమయంలో ఎవరో ఈ ఫోటోలు తీశారు. ఆ సమయంలో సబా కమర్ చేతిలో సిగరెట్ ఉంది. ఈ ఫోటోలు లీక్ అయ్యాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ ఆమె సన్నిహితులు హితవు పలికారు.
Recommended Video


అప్పుడు మహీరా
గతంలో కూడా ఇలాంటి వివాదం ఒకటి జరిగింది. రణబీర్ కపూర్ తో కలసి మహీరా సిగరెట్ కాల్చుతున్న పిక్స్ వైరల్ అయి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. సబా కమర్ వివాదం కూడా అదే విధంగా మారింది.


Click it and Unblock the Notifications











