ప్రియాంక చోప్రాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పౌరుల పిటీషన్
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26 తెల్లవారు ఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతీకార దాడికి గర్విస్తూ ఇండియన్స్ అంతా ట్వీట్స్ చేశారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రియాంక చోప్రా కూడా 'జై హింద్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే ప్రియాంక చోప్రా ఇలా చేయడం పాకిస్థాన్‌లోని ఆమె అభిమానులకు నచ్చలేదు.

నీకు ఆ అర్హత లేదు, ప్రియాంకకు వ్యతిరేకంగా పిటీషన్
ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక చోప్రాను వెంటనే తొలగించాలని కొందరు పాకిస్థాన్ సిటిజన్లు ఆన్ లైన్లో పిటీషన్ దాఖలు చేశారు. శాంతి కోసం పని చేసే ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా ఉంటూ ఒక దేశం చేపట్టిన మిలటరీ యాక్షన్‌కు సపోర్టు చేస్తూ కామెంట్స్ చేయడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా యునిసెఫ్ తరుపున 2010 నుంచి పని చేస్తున్నారు. కానీ 2016 వరకు మాత్రమే యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా పని చేసినట్లు వికీపీడియా పేజీలో పేర్కొనబడి ఉంది. కొందరు పాకిస్థానీలు ఆమె ఇప్పటికీ యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉందని భావించి ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

పుల్వామా దాడికి ప్రతీకారం
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ పాకిస్థాన్ ప్రభుత్వం వారికి ఆయుధాలు, నిధులు సరఫరా చేస్తోంది. అలా పాక్ ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఫిబ్రవరి 14న పుల్వామాలో సూసైడ్ బాంబర్ ద్వారా 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిసింది.

అభినందన్ వర్దమాన్
భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ 2 అనంతరం పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి దూసుకురావడంతో వాటిని తరిమికొట్టేందుకు తన మిగ్ 21 బైసన్ విమానంతో బయల్దేరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్... తన విమానం పాక్ భూభాగంలో కూలి పోవడంతో దాయాది దేశం సైన్యానికి చిక్కాడు. అయితే అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో పాకిస్తాన్ ప్రభుత్వం మార్చి 1న అతడిని భారత్‌కు అప్పగించింది.


Click it and Unblock the Notifications











