‘పల్టాన్’ ట్రైలర్: దేశభక్తితో రోమాలు నిక్కబొడుస్తాయి!
భారత్-పాకిస్థాన్ యూద్ధాల నేపథ్యంలో బోర్డర్, ఎల్ఓసి కార్గిల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జె.పి దత్తా తాజాగా మరో వార్ బేస్డ్ మూవీ 'పల్టాన్'తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సారి శత్రువు పాకిస్తాన్ కాదు... చైనా.
1962, 1967లో జరిగిన ఇండో-చైనా యుద్దాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1962 యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటి? ఆ ఓటమి తర్వాత 1967లో జరిగిన యుద్ధంలో చైనాపై ఇండియా ఎలా విజయం సాధించింది అని చూపిస్తూ సినిమా సాగుతుంది.

ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, సోనూ సూద్ ముఖ్య పాత్రల్లో నటించారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్రైలర్ చూస్తే మీరు కూడా ఎమోషనల్ అవ్వడం ఖాయం. సైనికులపై గౌరవం మరింత పెరిగేలా, పౌరుల్లో దేశభక్తి రగిలించేలా ఈ సినిమా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
1962 యుద్ధంలో చైనా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఈ యుద్ధంలో భారత్ 1383 సైనికులను కోల్పోయింది. 1047 మంది గాయపడ్డారు. 1696 మంది ఆచూకీ లేకుండా పోయింది. ఓటమి కసితో ఉన్న భారత సైన్యం 1967లో జరిగిన యుద్ధంలో ఎలా పోరాడారు అనేది 'పల్టాన్' మూవీలో అద్భుతంగా చూపించారు అనేది ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











