ప్యాంట్ వేసుకోవడం మరిచిన శిల్పాశెట్టి!.. ‘నగ్న జనరేషన్’ నెటిజన్ల దాడి!
సినీతారల ఓవర్ ఫ్యాషన్ అప్పడప్పుడు వారిని ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. వారు ధరించే దుస్తులు అప్పడప్పుడు వారిని సమస్యలకు గురిచేస్తుంటాయి. ఇటీవల బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి ధరించిన డ్రస్‌పై నెటిజన్లు చీల్చి చెండాడారు. ఇదేం పోయేం కాలం అని నోరు బాదుకొన్నారు. శిల్పాశెట్టి ధరించిన డ్రస్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఎప్పుటిదో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శిల్పాశెట్టి ఫొటో వైరల్
గతంలో తన కూమరుడు వియాన్‌ను చేతిలో పట్టుకొని ముంబై నగర వీధుల్లో నడిచి వెళ్తున్న శిల్పాశెట్టి ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. కింద ప్యాంటు లేకుండా శిల్పాశెట్టి నడిచి వెళ్లిన ఫోటోను ఎవరో క్లిక్ అనిపించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు.

శిల్పా.. చూడటానికి అసహ్యంగా
శిల్పాశెట్టి డ్రస్ చూస్తే చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. నంగీ (నగ్న) జనరేషన్ అంటూ కొందరు కామెంట్ చేశారు. నగ్నంగా తిరగడం అదేమన్నా గొప్ప పని అనుకొంటున్నావా అంటీ అంటూ మరోకరు అన్నారు.

ప్యాంట్ వేసుకోవడం మరిచిందేమో
పై భాగం కంటే కింది భాగం ఫిట్‌గా కనిపిస్తుంది. పై డ్రస్ కూడా తీసేసి నడిస్తే ఇంకా ఫిట్‌నెస్ మ్యాజిక్ భలే కనిపిస్తుంది. బహుశా సల్వార్ వేసుకోవడం శిల్పా మరిచిపోయిందేమో అని మరొకరు కామెంట్ చేశారు.

గతంలో కూడా నెటిజన్లు
గతంలో కూడా భర్తతో కలిసి బికినీ ధరించిన శిల్పాశెట్టిపై దారుణంగా ట్రోల్స్ వేశారు. మరోసారి టర్కీ మాంసం తింటూ కనిపించడంపై కూడా నెటిజన్లు ప్రశ్నించారు. జంతు సంరక్షణకు సంబంధించిన అవార్డు తీసుకొని మాంసాహారం భుజిస్తావా అని దుమ్ము దులిపారు.


Click it and Unblock the Notifications











