twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తతో కాపురం చేస్తూ నాతో డేటింగ్... బిగ్‌బాస్‌ బ్యూటీ సీక్రెట్‌ పెళ్లి గుట్టురట్టు చేసిన మాజీ లవర్

    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 14 మొదటి రోజు నుంచే వివాదాల్లో కూరుకుపోతున్నది. బిగ్‌బాస్ ఇంటిలో హాట్ హాట్ హీరోయిన్ పవిత్ర పునియాపై ఆమె ప్రియుడు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ పరాస్ ఛాబ్రా సంచలన ఆరోపణలు చేశారు. అయితే పరాస్ నోరు విప్పడానికి కారణం పవిత్ర పునియానే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదంలోకి వెళితే..

    నా ప్రియుడితో డేటింగ్ చేయడం తప్పు

    నా ప్రియుడితో డేటింగ్ చేయడం తప్పు

    బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి సల్మాన్‌ ఖాన్‌తో తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకొంటూ.. నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్స్ బాగా లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నాను. అతడితో రిలేషన్ పెట్టుకోవడం జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు అంటూ తన బాధను సల్మాన్‌కు పవిత్ర పునియా చెప్పుుకొన్నారు.

    నాతో డేటింగ్ చేస్తూనే

    నాతో డేటింగ్ చేస్తూనే

    తనపై ఆరోపణలు చేసిన పవిత్ర పునియాపై పరాస్ చాబ్రా మండిపడ్డారు. నేను డేటింగ్ చేస్తుండగానే మరొకరితో పెళ్లి అయిందనే విషయం తెలిసింది. స్వయంగా పవిత్ర పునియా భర్తనే నాకు చెప్పారు అని పరాస్ చబ్రా గుట్టు విప్పాడు. దాంతో పవిత్ర పునియా వ్యవహారం బిగ్‌బాస్‌లో వివాదంగా మారింది.

    స్వయంగా పవిత్ర పునియా భర్తనే

    స్వయంగా పవిత్ర పునియా భర్తనే

    పవిత్ర పునియా గురించి పరాస్ చబ్రా మాట్లాడుతూ.. వివాహితతో డేటింగ్ చేయడం తప్పు. తనకు పెళ్లైన విషయాన్ని చెప్పకుండా నన్ను వెధవను చేసింది. స్వయంగా ఆమె భర్త నాకు మెసేజ్ చేసి విషయం చెప్పాడు. మీరిద్దరు కలసి ఉంటే నాకు ఇబ్బంది ఏమి లేదు. అమెకు నేను డైవోర్స్ ఇచ్చిన తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉండు అంటూ పరాస్ చబ్రా తెలిపారు.

    ఇదివరకే పెళ్లి అయిందనే పవిత్ర చెప్పింది

    ఇదివరకే పెళ్లి అయిందనే పవిత్ర చెప్పింది

    పెళ్లి విషయంపై తాడో పేడో తేల్చుకోవాలని పవిత్రతో నిర్ణయించుకొని నిలదీశాను. దాంతో తనకు పెళ్లి జరిగిందని ఒప్పుకొన్నారు. దాంతో నేను మరింత షాక్ తిన్నాను. ఆ సమయంలో ఆమెతో ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేసిన తర్వాత నోరు విప్పాల్సి వచ్చింది అని పరాస్ చాబ్రా తెలిపారు.

    English summary
    Actor Paras Chhabra about dating Pavitra Punia and her marriage. Paras Chhabra told, she was already married to someone while dating with me. Now Pavitra Punia in BIgg boss 14 house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X