Boycott Radhika Apte.. పోర్న్‌కు దానికి తేడా లేదా? రాధికా ఆప్టేకు అండగా..

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న రాధికా ఆప్టే తాజాగా ఓ వివాదంలో చిక్కుకొన్నారు. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టించే విధంగా శృంగారపరమైన పాత్రలతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై రాధికా ఆప్టేను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఉన్నట్టుండి రాధికా ఆప్టేను ఎందుకు నెటిజన్లు, కొన్ని వర్గాలు టార్గెట్ చేసుకొన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అయితే రాధికా ఆప్టేను భారతీయ సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు నిషేధించాలని డిమాండ్ లేచింది? ఆమెకు అండగా ఎవరు నిలిచారు అనే విషయాల్లోకి వెళితే..

Recommended Video

రాధికా ఆప్టే నీతితప్పిన మహిళ, 'వేశ్య' అంటూ ట్రోల్
పార్చ్‌డ్ చిత్రంలో రొమాంటిక్‌గా

పార్చ్‌డ్ చిత్రంలో రొమాంటిక్‌గా

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే 2015లో పార్చ్‌డ్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఆదిల్ హుస్సేన్ అనే నటుడితో అతిసన్నిహితంగా, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

 రాధికా ఆప్టేపై నెటిజన్స్ ట్రోలింగ్

రాధికా ఆప్టేపై నెటిజన్స్ ట్రోలింగ్

దాంతో రాధికా ఆప్టే సినిమాల్లో శృంగారం విచ్చలవిడిగా ఉంటుంది. ఆమె భారతీయ సంస్కృతికి విరుద్దమైన సినిమాల్లో నటిస్తున్నది. కాబట్టి ఆమెను సినీ పరిశ్రమ నుంచి నిషేధించాలి. ఆమె సినిమాలను ప్రదర్శించకుండా ఆంక్షలు విధించాలి అంటూ కొందరు నెటిజన్లు ట్వీట్లతో హంగామా చేశారు. దాంతో రాధికా ఆప్టే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారారు. #BoycottRadhikaApte హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది.

రాధికా ఆప్టేపై ట్రోలింగ్ దారుణం

రాధికా ఆప్టేపై ట్రోలింగ్ దారుణం

అయితే రాధికా ఆప్టేపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి పార్చ్‌డ్ చిత్రంలో నటించిన హీరో ఆదిల్ హుస్సేన్ స్పందించారు. గూగుల్ అలర్ట్‌తో రాధికా ఆప్టేపై జరుగుతున్న ట్రోలింగ్ విషయం నాకు తెలిసింది. ఆ సీన్లను పెద్దగా చిత్రీకరిస్తూ రాధికా ఆప్టేను ట్రోల్ చేయడం చాలా దారుణం. అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవద్దు అంటూ ఆదిల్ హుస్సేన్ స్పష్టం చేశారు. నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలాంటి దాడులు సరైనవి కావు అంటూ ఆయన స్పష్టం చేశారు.

Ramyasri Murder : వాడిని నరికిన వాడితో పడుకుంటా.. తెలుగు నటి సంచలనం!
https://telugu.filmibeat.com/heroine/rekha-boj-sensational-comments-on-ramyasri-murder-101936.html

కళకు, అశ్లీలతకు తేడా తెలియదా?

కళకు, అశ్లీలతకు తేడా తెలియదా?

రాధికా ఆప్టేతో నేను నటించిన శృంగార సన్నివేశాలు అంత అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కళకు, అశ్లీలతకు తేడా తెలియని వాళ్లే ఇలాంటి ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. కళలు అనే విషయం మన సమాజంలో ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇలా ట్రోలింగ్‌కు పాల్పడేవాళ్లు కళల గురించి తెలుసుకోవడానికి స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందేమో అంటూ ఆదిల్ హుస్సేన్ ఘాటుగా స్పందించారు.

 బెల్ బాటమ్ చిత్రంలో

బెల్ బాటమ్ చిత్రంలో

ఆదిల్ హుస్సేన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ చిత్రంలో నటించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, లారా దత్తా, వాణి కపూర్ తదితరులు నటించారు. దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆగస్టు నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X