పరేష్ రావల్ చనిపోయాడంటూ ప్రచారం.. ఆయన రియాక్షన్ అదుర్స్!
తెలుగు ప్రజలకు పరేష్ రావల్ అనేది పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో 1991లో క్షణ క్షణం సినిమా ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత మనీ, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావాడు లాంటి అనేక సినిమాల్లో నటించారు. అన్నిటికంటే ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్. ఈ సినిమాలో లింగం మయ్య అంటూ చిరంజీవి ఆయనను పిలిచే పిలుపు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ రోజు ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే

వర్మ సినిమాలతో
తెలుగు ప్రేక్షకులకు పరేష్ రావల్ ను పరిచయం చేసింది రామ్ గోపాల్ వర్మ. ఆయన క్షణ క్షణం సినిమా ద్వారా పరేష్ రావల్ ను టాలీవుడ్ ప్రజలకు పరిచయం చేశారు. ఆ తర్వాత వర్మ ఎక్కువగా తన సినిమాల్లో పరేష్ రావల్ కు అవకాశాలు ఇస్తూ వచ్చారు.. ఆ తర్వాత ఆయనకు మంచి అవకాశాలు దక్కకపోయినా సరే బాలీవుడ్లో మాత్రం తన సత్తా చాటారు. బాలీవుడ్లో దాదాపు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారు.

లింగం మాయ్య
మరీ ముఖ్యంగా పరేష్ రావల్ తెలుగులో నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఆయనను తెలుగువారికి బాగా దగ్గర చేసింది. ఆ సినిమాలో హాస్పిటల్ డీన్ పాత్రలో నటించిన ఆయనను చిరంజీవి ఆటపట్టిస్తూ ఉండే ఎపిసోడ్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఇప్పటికి కూడా లింగం మాయ్య అనే పేరు తెలుగు వాళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

చనిపోయారంటూ
అయితే ఈ మధ్య కాలంలో అసలు ఏ మాత్రం ఊహించని విధంగా కొంతమంది సీనియర్ నటులు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో అనూహ్యంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా వాడకం మరీ ఎక్కువ అయిపోయాక ఇలాంటి విపరీతమైన పోస్టులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

అశ్రునయనాలతో
ఈరోజు కూడా పరేష్ రావల్ చనిపోయారని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు అంటూ అశ్రునయనాలతో ఆయనకు చాలా మంది నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త ఎవరి నుంచి ఎవరికి చేరిందో తెలియదు గానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ అంశం మీద పరేష్ రావల్ స్పందించక తప్పలేదు.
Recommended Video
నిద్రపోతున్నా సారీ
ఆ పోస్టులకు ఆయన స్పందిస్తూ 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఉదయం 7 గంటలకు నిద్ర పోతూ ఉన్నాను' అంటూ సమాధానం ఇచ్చారు. "Sorry for the misunderstanding as I slept past 7am ...!" అంటూ ఎంతో అదిరిపోయే సమాధానం ఇచ్చారు పరేష్ రావల్. పలువురు నెటిజన్లు ఈ రిప్లై చూసి తాము కూడా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆయన మీమ్స్ తో సరదాగా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











