వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత కరోనా పాజిటివ్.. బాలీవుడ్ నటుడి పోస్టు వైరల్
ప్రస్తుతం భారతదేశంలో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కూడా వచ్చేలా ఉన్నాయి. మళ్లీ సినీ రంగంలో కరోనా తాండవం చేస్తోంది. స్టార్ సెలెబ్రిటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. మొన్నీ మధ్యే ఆమిర్ ఖాన్‌కు కరోనా సోకింది. ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ కూడా అందరికీ పంపిణీ చేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్..
దేశంలో కరోనా వ్యాక్సిన పంపిణీ కూడా జోరుగా సాగుతోంది. కరోనాకు మందు వచ్చిందన్న భరోసాతో జనాలు నియమ, నిబంధనలు పాటించడం లేదు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండటంతో కరోనా రెక్కలు విప్పుకుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

వ్యాక్సిన్‌పై అలా..
కరోనా వ్యాక్సిన్‌పై జనాల్లో కొన్ని అనుమానాలున్నాయన్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేయడంతో కొన్ని చోట్ల మరణాలు సంభవించానే రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇంకొందరికీ తీవ్ర అస్వస్థత ఏర్పడటం కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే కొందరికి మాత్రం విచిత్రం కరోనా వ్యాక్సిన్ వేశాక పాజిటివ్ అని వస్తోంది.

తాజాగా అలా..
గత వారం బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌ను వేసుకున్నాడు. అయితే తీరా ఆయనకు ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ పరేష్ రావల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

దురదృష్టవశాత్తు..
దురదృష్టవశాత్తు నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. గత పది రోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా కూడా టెస్టులు చేసుకోవాలని కోరుతున్నానంటూ పరేష్ రావల్ ట్వీట్ వేశాడు. ఇక బాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా పరేష్ రావల్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











